
నటి తారా చౌదరిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
నటి తారా చౌదరిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ : నటి తారా చౌదరిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే తారాచౌదరి ఇంటికి విజయవాడకు చెందిన ఆమె స్నేహితుడు దుర్గాప్రసాద్ ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం దుర్గాప్రసాద్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సోమవారం ఉదయం తారాచౌదరి ఇంటికి వచ్చి చంపేస్తానని బెదరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేశారు. గతంలోనూ తారా చౌదరి
తన పట్ల వాచ్మెన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.