హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ యువతిని కొందరు దుండగులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మంజూష(22) అనే యువతి కూకట్‌పల్లిలోని సోదరి ఇంటికి 15 రోజుల కిందట వచ్చింది.
అయితే సోమవారం రాత్రి మార్కెట్‌కు వెళ్లిన మంజూషను కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.