'రెండేళ్ల తర్వాత నాకొడుకు గొంతువిన్నా' | Former Pak PM Gilani speaks to son abducted 2 years ago | Sakshi
Sakshi News home page

'రెండేళ్ల తర్వాత నాకొడుకు గొంతువిన్నా'

Published Sun, May 24 2015 4:10 PM | Last Updated on Mon, May 28 2018 1:37 PM

'రెండేళ్ల తర్వాత నాకొడుకు గొంతువిన్నా' - Sakshi

'రెండేళ్ల తర్వాత నాకొడుకు గొంతువిన్నా'

లాహోర్: దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తన కుమారుడి గొంతు విన్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఆదివారం మీడియాకు తెలిపారు. ఒక కొత్త ఫోన్ నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అందులో మాట్లాడింది తన కొడుకేనన్న విషయం గుర్తుపట్టానని చెప్పారు. గిలానీ కుమారుడు అలి హైదర్ ను 2013లో తెహ్రిక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి అతడు ఏమై పోయాడు ఎక్కడున్నాడన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. ఉన్నట్లుండి రెండేళ్ల తర్వాత హైదర్ నుంచి ఫోన్ రావడంతో గిలానీ ఆనందంతో ఉప్పొంగారు. తాను బాగానే ఉన్నానని, మీరు, మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని అడిగారని చెప్పారు.

ఎనిమిది నిమిషాలపాటు తన కుమారుడితో మాట్లాడానని, అతడు సురక్షితంగా తిరిగొస్తాడన్న నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తన వద్ద నుంచి ఏమి డిమాండ్ చేయడం లేదని, జైళ్లో ఉన్న తమ అగ్ర నేతలను మాత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని గిలానీ చెప్పారు. అయితే, వారిలో కొందరని ఇప్పటికే వదిలేశారని, కానీ తాలిబన్లు మాత్రం తన కుమారుడిని వదిలిపెట్టకుండా మాట తప్పారని అన్నారు. సంకెళ్లతో బంధించి ఉన్నహైదర్కు చెందిన వీడియోను ఇటీవలె తాలిబన్లు పాక్ ప్రభుత్వానికి విడుదల చేశారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement