కోటీశ్వరుని కూతురు.. వృత్తిరీత్యా టీచర్.. గౌరవప్రదంగా సాగిపోతున్న జీవితం. దానికి తోడు ఎంత తిన్నా.. తరగని సంపదలు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే వ్యక్తిత్వం ఆమెది. అందిరినీ కలుపుకుపోయే తత్వం.. శత్రుత్వం అనే మాటే తెలియదు. ఉదయాన్నే 4 గంటలకే వ్యాయామం వెళ్లడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు. కానీ ఓ రోజు ఉదయం.. అదే చివరి వ్యాయామం అయింది. అంత మంచి ఆవిడకు ఏమైంది? ఆవిడను ఎవరు హతమార్చారు?
ఆమె పేరు ఎలిజా ఫ్లెచర్(34). ఆవిడ తండ్రి కోటీశ్వరుడు. వారు అమెరికాలోని టెన్నిసీ నగరంలో నివసిస్తున్నారు. ఫ్లెచర్ వృత్తిరీత్యా టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటు తల్లిగా.. టీచర్‌గా తన విధిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. కావాల్సినంత డబ్బు.. జీవితం సుఖంగా సాగుతుంది. అయితే.. ఫ్లెచర్‌కు ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే వ్యాయామానికి వెళ్లే అలవాటు ఉంది. ఆ రోజు అలాగే వ్యాయామానికి వెళ్లింది.
అనుకోని అతిథి..
ఫ్లెచర్ రోడ్డు వెంట జాకింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎదురయ్యాడు ఓ కరుడుగట్టిన నేరస్తుడు. యూనివర్శిటీ ఆఫ్ మెంఫీస్ క్యాంపస్ వద్ద ఆమె మార్గానికి అడ్డుతగిలాడు. చీకటిగా ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లాడు. గన్‌తో తలపై కాల్చేశాడు. బాధితురాలు ఫ్లెచర్ మృతదేహాన్ని ఓ కొండ ప్రాంతంలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అటాప్సీ నివేదికల ప్రకారం బాధితురాల‍్ని గన్‌తో తల వెనక భాగంలో కాల్చినట్లు తేలింది.
ఎలా పట్టుబడ్డాడంటే..
ఆ మరుసటి రోజే క్లియోథా అబ్స్టన్ అనే నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె మృతదేహం లభ్యమైన సమీప ప్రాంతంలోనే సర్వేలెన్స్ ఆధారంగా అబ్స్టన్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. అయితే.. ఫ్లెచర్‌పై దాడి జరిగిన ప్రాంతంలో వదిలిన చెప్పుల జోడు ఆధారంతో డీఎన్‌ఏ రిపోర్టుల ద్వారా నిందితున్ని గుర్తించామని వెల్లడించారు.
మరణశిక్ష విధించాలని డిమాండ్..
గత ఏడాది సెప్టెంబర్ 2న ఈ ఘటన జరిగగా.. ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది. దోషికి మరణశిక్ష విధించాలని బాధితురాలు తరుపు న‍్యాయవాది న్యాయమూర్తిని కోరారు. నేరస్తుడు బాధితురాలిపై వ్యవహరించిన తీరు హేయమైనదని చెప్పారు. ఫ్లెచర్ కుటుంబ సభ్యులు కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కేసుల్లో చట్టాన్నే అనుసరించి శిక్ష విధించాల్సి వస్తుందని న్యాయమూర్తి తెలిపారు.
నేర చరిత్ర..
గతంలోనే అబ్ట్సన్‌కు చాలా నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో ఓ మర్డర్ కేసులో ఇప్పటికే 20 ఏళ్ల శిక్షను అనుభవించాడు. కాగా.. 2021 ఆగష్టులో అబ్ట్సన్ తనపై దాడి చేశాడని అలిసియా ఫ్రాంక్లిన్ అనే మహిళ ఆరోపించారు. తనను గన్‌తో బెదిరించి ఖాలీగా ఉండే అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లాడని తెలిపారు. అనంతరం తన కళ్లకు గంతకు కట్టి.. కారు వెనక భాగంలో పడేసి అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఘనటపై ఆమె పోలీసులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కానీ పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు
Comments
Please login to add a commentAdd a comment