కిడ్నాపర్ల చెర నుంచి ఆఫ్ఘాన్ దౌత్యాధికారి విడుదల | Abducted Afghan official freed in Pakistan | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల చెర నుంచి ఆఫ్ఘాన్ దౌత్యాధికారి విడుదల

Published Sun, Sep 1 2013 11:45 AM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

Abducted Afghan official freed in Pakistan

ఆగంతకుల చేతిలో గత జులైలో క్విట్టా ప్రాంతంలో కిడ్నాప్నకు గురైన ఆఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయ ఉన్నతాధికారి హషిమ్ ఎబ్రాత్ను పాకిస్థాన్లో శనివారం  విడిచిపెట్టారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. కందహార్ జైల్లో ఉన్న ముగ్గురు తాలిబన్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎబ్రాత్ను కిడ్నాప్ చేశారు.

 

అయితే ఎబ్రాత్ విడుదలను ఆఫ్ఘాన్లోని రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఎబ్రాత్ ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులతో కలసి సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు ఆ అధికార ప్రతినిధి నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement