కిడ్నాపర్ల చెర నుంచి ఆఫ్ఘాన్ దౌత్యాధికారి విడుదల
ఆగంతకుల చేతిలో గత జులైలో క్విట్టా ప్రాంతంలో కిడ్నాప్‌నకు గురైన ఆఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయ ఉన్నతాధికారి హషిమ్ ఎబ్రాత్ను పాకిస్థాన్‌లో శనివారం విడిచిపెట్టారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. కందహార్ జైల్లో ఉన్న ముగ్గురు తాలిబన్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎబ్రాత్ను కిడ్నాప్ చేశారు.
అయితే ఎబ్రాత్ విడుదలను ఆఫ్ఘాన్లోని రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఎబ్రాత్ ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులతో కలసి సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు ఆ అధికార ప్రతినిధి నిరాకరించారు.