
శ్రీనగర్ : ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 11 మందిలో ముగ్గురిని శుక్రవారం విడుదల చేశారు. ముగ్గురు పోలీసుల కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు జమ్ము కశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వైద్ తెలిపారు. వీరిలో ఇద్దరు కుల్గాంకు, ఒకరు పుల్వామాకు చెందినవారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు గురు, శుక్రవారాల్లో దక్షిణ కశ్మీరులో పోలీసు కుటుంబాలకు చెందిన 11 మందిని అపహరించడంతో కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షకీల్ అహ్మద్‌ను గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
రెండు రోజుల క్రితం పోలీసులు తమ కుటుంబీకుల ఇళ్లపై దాడి చేసిన నేపథ్యంలో.. దానికి ప్రతీకారంగా కశ్మీర్ ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను అపహరించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment