Shakeel Ahmad
-
కారు డ్రైవ్ చేసింది షకీల్ కొడుకే: డీసీపీ విజయ్
సాక్షి, హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ పేరును కూడా చేర్చినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ సాక్షి ద్వారా స్పందించారు. ‘‘ప్రజా భవన్ వద్ద న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వీళ్లంతా స్టూడెంట్స్. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నాం’’ అని డీసీపీ విజయ్‌కుమార్ సాక్షికి తెలిపారు. ఆపై షకీల్ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. కానీ, సీసీ ఫుటేజీ, ఘటన దర్యాప్తు ద్వారా రహిల్ వాహనం నడిపినట్లు నిర్ధారించుకున్నాం. రహిల్‌పై గతంలో జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదు అయ్యింది (ఆ కేసులో ఓ బాలుడు కూడా మృతి చెందాడు). ఆ కేసు పూర్వాపరాలను కూడా గమనిస్తాం. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడతాం అని డీసీపీ సాక్షితో అన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ కవిత రియాక్షన్!
సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు, ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో, ఇద్దరు నేతలకు నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలంలో ఏఆర్పీ క్యాంపులో షకీల్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఎందుకు గ్రామంలోకి వచ్చారని షకీల్‌ను నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, షకీల్‌కు నిరసన సెగపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. 60 లక్షల మంది గులాబీ సైన్యం ముందు మీరెంత?. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ప్రజాక్షేత్రంలో దాడులను ధీటుగా ఎదుర్కొంటారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. ఎల్లారెడిలో బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్‌కు సైతం నిరసన సెగ తగింది. లక్ష్మాపూర్‌లో సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా గడిచిన ఐదేళ్లలో సమస్యలు పట్టించుకోలేదని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఊరి మీదుగా వెళ్తూ కనీసం ఒక్కసారి కూడా ఆగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
ఉగ్రచెర నుంచి ముగ్గురికి విముక్తి
శ్రీనగర్ : ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 11 మందిలో ముగ్గురిని శుక్రవారం విడుదల చేశారు. ముగ్గురు పోలీసుల కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు జమ్ము కశ్మీర్ డీజీపీ శేష్ పాల్ వైద్ తెలిపారు. వీరిలో ఇద్దరు కుల్గాంకు, ఒకరు పుల్వామాకు చెందినవారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు గురు, శుక్రవారాల్లో దక్షిణ కశ్మీరులో పోలీసు కుటుంబాలకు చెందిన 11 మందిని అపహరించడంతో కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నాడనే ఆరోపణలతో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షకీల్ అహ్మద్‌ను గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. రెండు రోజుల క్రితం పోలీసులు తమ కుటుంబీకుల ఇళ్లపై దాడి చేసిన నేపథ్యంలో.. దానికి ప్రతీకారంగా కశ్మీర్ ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను అపహరించినట్టు తెలుస్తోంది. -
'వాళ్లు ముస్లింలు ఐతే ఏం చెప్పేవారో!'
న్యూఢిల్లీ: ఇటీవల పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ ఛోటారాజన్, ఉగ్రవాద సంస్థ ఉల్ఫా నేత అనూప్ చెటియా విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షకీల్ అహ్మద్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 'ఛోటా రాజన్, అనూప్ చెటియా (ఉల్ఫా) ముస్లింలు కానందుకు కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లు ముస్లింలు అయి ఉంటే మోదీ ప్రభుత్వం పూర్తి భిన్నమైన కథనాన్ని చెప్పి ఉండేది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. సీనియర్ నాయకుడు అయినప్పటికీ అహ్మద్ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారని, అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తులను కూడా హిందు, ముస్లింల పేరిట ఆయన విడదీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. బీజేపీ నేతలు విమర్శలతో ట్వీట్లు వివాదాస్పదమైన నేపథ్యంలో షకీల్ అహ్మద్ వివరణ ఇచ్చారు. ఉగ్రవాదంపై మోదీ, బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టేందుకు తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. వాళ్లు ముస్లింలు అయి ఉంటే ఆ కారణంతోనే గత యూపీఏ ప్రభుత్వం వారిని అరెస్టు చేయలేదని, వాళ్లు ముస్లింలన్న కారణంతో ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని బీజేపీ నేతలు విమర్శించేవారని ఆయన తెలిపారు. -
నితీశ్ కు మద్దతు కొనసాగుతుంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బీహార్‌లో జేడీ(యూ) ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. ఈ విషయంలో వెనక్కు తగ్గబోమని చెప్పారు. కాగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామని జేడీ(యూ) నేత విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. నితీశ్‌ను కొనసాగించాలా, వద్దా అనే దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు రాజీనామాకు వ్యతిరేకంగా జేడీ(యూ) కార్యకర్తలు నితీశ్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. రాజీనామా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు -
ఆప్ వైపు మైనారిటీల చూపు..
ముంబై: ‘ముస్లింలు చాలా కోపంగా ఉన్నారు.. తమను ప్రస్తుత సంప్రదాయ పార్టీలేవీ పట్టించుకోవడంలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ఆ తర్వాత వారి అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇన్నాళ్లుగా మోసం చేస్తూ వస్తోన్న పార్టీలకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారు తమ ఆగ్రహాన్ని రుచి చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నార’..ని ఆమ్ఆద్మీ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రలో ఆప్‌కు ముస్లింలు వెన్నుదన్నుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ‘బీడ్, మరఠ్వాడా, ఒస్మానాబాద్లలో ముస్లింలు ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మౌలానా లేదా మౌల్వీ ఆదేశాలను పాటించేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు..’ అని ఆప్ మరఠ్వాడా యూనిట్ ఇన్చార్జి, సమాజసేవకుడు, న్యాయవాది అయిన షకీల్ అహ్మద్ తెలిపారు.‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ వస్తున్నారు.. అయితే ఇప్పుడు వారి పరిస్థితి అప్పటికంటే ఇంకా అధ్వానంగా ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు. తుల్జాపూర్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ షాబన్ మాట్లాడుతూ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే ప్రస్తుత ఎన్నికల్లో ముస్లింల డిమాండ్లు ఆధారపడి ఉంటాయని విశ్లేషించారు. ముస్లింల కోసం ముఖ్యమంత్రి వేసిన కమిటీలో సభ్యుడు కూడా అయిన షాబన్ ఇంకా మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే మొదటిసారి అభివృద్ధి అంశాల్లో ముస్లింలకూ చోటిచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో విఫలమైందనే చెప్పొచ్చు. కేవలం కాంగ్రెస్‌పై కోపంతోనే ముస్లింలు ఆప్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటే సేందుకు సిద్ధపడుతున్నారు..’ అని వివరించారు. ఆప్ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడైన మయాంక్ గాంధీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే సచార్ కమిటీ నివేదికను అమలులోకి తెస్తామని చెప్పారు. కొన్ని మతాల వారు తమ మాతృదేశంలోనే రక్షణ లేదని భావిస్తున్నారని ఆప్‌లో చేరిన సామాజిక కార్యకర్త సలీం అల్వారే చెప్పారు. ‘ఆప్ ముస్లింలను మభ్యపెట్టే ప్రకటనలేవీ చేయడంలేదు.. వారి అభివృద్ధికి హామీ ఇస్తూ తమ మానిఫెస్టోలో పలు పథకాలను పొందుపరిచింది..’ అని వివరించారు. బాంద్రా మురికివాడల్లో నివసించే ముస్లింలలో ఎక్కువమంది బీజేపీకి గాని, కాంగ్రెస్‌కు గాని ఓటేసేందుకు సిద్ధంగా లేరని పర్యావరణవేత్త సుమారియా అబ్దులాలీ చెప్పారు. కాగా, కాంగ్రెస్ హయాంలో ముస్లింలు అభివృద్ధి చెందలేదనే వాదనను ఆ పార్టీ నాయకులు తిప్పి కొడుతున్నారు. ఆ పార్టీ నేత యూసుఫ్ అబ్రహాని మాట్లాడుతూ.. గత 60 ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని మించిన లౌకిక పార్టీ ఏదీలేదనే విషయం అర్థమవుతుందన్నారు. తమ పార్టీ హయాంలోనే ముస్లింలకు ఎక్కువ రక్షణ లభిస్తోందని ఆయన వివరించారు. ముస్లింలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ లబ్ధిపొందారని వ్యాఖ్యానించారు. ఆప్‌ను ‘అబద్ధాల కోరు’గా ఆయన అభివర్ణించారు. ఆప్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేసినట్లేనని ఆయన హెచ్చరించారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఖాదర్ చౌదరీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ఓటు బ్యాంక్‌లను కొల్లగొట్టడం ఆప్ వల్ల సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తమపై ఆప్ ప్రభావం ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
12వ తేదీ నాటికి కాంగ్రెస్ జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులెవరో తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. దాదాపు పదో తేదీలోగా కాంగ్రెస్ జాబితా వెలువడవచ్చని ఆశించినా అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాగ్రత్త గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సెం ట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం సమావేశమై స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను పరిశీలించింది. అభ్యర్థుల పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నామని, అభ్యర్థుల జాబితా 11 లేదా 12వ తేదీ నాటికి వెలువడవచ్చని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ షకీల్ అహ్మద్ తెలిపారు. 12వ తేదీ నాటికి దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని, ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు మిగిలిపోయినా నవంబర్ 16 వ రకు.. అంటే నామినేషన్ల చివరి రోజునాటికి ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం సమావేశమై అభ్యర్థుల పేర్లను చర్చించింది. స్థానికులు వ్యతిరేకిస్తున్న నేతలకు టికెట్ ఇచ్చినట్లయితే అసమ్మతిని ఎదుర్కోవలసి ఉంటుందని పార్టీ ఆందోళన చెందుతోం ది. బీజేపీలో రేగిన అసమ్మతి జ్వాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో జాగ్రత్త పడుతోంది. ఎమ్మ్మెల్యేలందరికీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కోరుతున్నప్పటికీ దాదాపు డజను సీట్లలో ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము వ్యతిరేకిస్తున్న శాసనసభ్యులకు టికెట్ ఇచ్చినట్లయితే తాము తిరుగుబావుటాలను ఎగురవేస్తామని వారు ఇప్పటికే షీలాదీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్‌ను హెచ్చరించారు. ఈ సీట్లలో మాల వీయనగర్, పటేల్‌నగర్, రాజేంద్రనగర్, ఆదర్శ్ నగర్, చాందినీ చౌక్, వజీర్పూర్, జంగ్‌పురా, కస్తూర్బాన గర్ నియోజకవర్గాలున్నాయి. నరేలా, రాజోరీ గార్డెన్ , ఓఖ్లా స్థానాల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా చర్చనీయాంశంగా మారింది. జీవితమంతా పార్టీ కోసం పాటుపడ్డవారిని పక్కనబెట్టి ఇప్పుడు పార్టీలో చేరేవారికి వారికి టికెట్ ఇస్తే ఒప్పుకోమని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.