12వ తేదీ నాటికి కాంగ్రెస్ జాబితా
Published Sat, Nov 9 2013 11:07 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులెవరో తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. దాదాపు పదో తేదీలోగా కాంగ్రెస్ జాబితా వెలువడవచ్చని ఆశించినా అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాగ్రత్త గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సెం ట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం సమావేశమై స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను పరిశీలించింది. అభ్యర్థుల పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నామని, అభ్యర్థుల జాబితా 11 లేదా 12వ తేదీ నాటికి వెలువడవచ్చని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్ తెలిపారు. 12వ తేదీ నాటికి దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని, ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు మిగిలిపోయినా నవంబర్ 16 వ రకు.. అంటే నామినేషన్ల చివరి రోజునాటికి ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం సమావేశమై అభ్యర్థుల పేర్లను చర్చించింది.
స్థానికులు వ్యతిరేకిస్తున్న నేతలకు టికెట్ ఇచ్చినట్లయితే అసమ్మతిని ఎదుర్కోవలసి ఉంటుందని పార్టీ ఆందోళన చెందుతోం ది. బీజేపీలో రేగిన అసమ్మతి జ్వాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో జాగ్రత్త పడుతోంది. ఎమ్మ్మెల్యేలందరికీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కోరుతున్నప్పటికీ దాదాపు డజను సీట్లలో ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము వ్యతిరేకిస్తున్న శాసనసభ్యులకు టికెట్ ఇచ్చినట్లయితే తాము తిరుగుబావుటాలను ఎగురవేస్తామని వారు ఇప్పటికే షీలాదీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్‌ను హెచ్చరించారు. ఈ సీట్లలో మాల వీయనగర్, పటేల్‌నగర్, రాజేంద్రనగర్, ఆదర్శ్ నగర్, చాందినీ చౌక్, వజీర్‌పూర్, జంగ్‌పురా, కస్తూర్బాన గర్ నియోజకవర్గాలున్నాయి. నరేలా, రాజోరీ గార్డెన్ , ఓఖ్లా స్థానాల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా చర్చనీయాంశంగా మారింది. జీవితమంతా పార్టీ కోసం పాటుపడ్డవారిని పక్కనబెట్టి ఇప్పుడు పార్టీలో చేరేవారికి వారికి టికెట్ ఇస్తే ఒప్పుకోమని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
Advertisement