రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాల అపహరణ | Abduction of srirama idol | Sakshi
Sakshi News home page

రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాల అపహరణ

Published Mon, Feb 9 2015 3:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

Abduction of srirama idol

కోనరావుపేట(కరీంనగర్): కొందరు గుర్తుతెలియని దుండగులు రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను అపహరించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని రామాలయంలో సోమవారం జరిగింది. వివరాలు.. కోనరావుపేట మండలంలోనే ప్రముఖ రామాలయం మామిడిపల్లి గ్రామంలో ఉంది. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి రామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement