ఎలియన్స్‌ నన్ను అపహరించి.. | I was abducted at six years old by aliens who came through the wall and raped me | Sakshi
Sakshi News home page

ఎలియన్స్‌ నన్ను అపహరించి..

Published Sun, Jul 31 2016 12:32 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

ఎలియన్స్‌ నన్ను అపహరించి.. - Sakshi

ఎలియన్స్‌ నన్ను అపహరించి..

గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? భూమి మీద కాకుండా వేరే గ్రహంపై కూడా జీవం ఉనికి ఉందా? అన్నది కచ్చితంగా నిర్ధారణ కాకపోయినా.. ఎలియన్స్‌ విషయంలో ఎన్నో ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ఎలియన్స్‌ ఉన్నారా? లేరా? అన్నదే పెద్ద చిక్కుముడి అంటే.. ఓ మహిళ అయితే ఈ విషయంలో అనేకానేక విస్మయకర విషయాలు చెప్పింది. ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు తనను గ్రహాంతరవాసులు అపహరించుకుపోయారని, తన పడకగది గోడల నుంచి గ్రహాంతర వాసులు తరచూ బటయకు వచ్చి తనను తీసుకెళుతారని బ్రిటన్‌కు చెందిన లీసా చెప్పుకొచ్చింది.

తన గది గోడల నుంచి బయటకు వచ్చే ఎలియన్స్‌ తరచూ తనను తీసుకెళ్లేవారని, అలా వాటితో వెళ్లడం వల్ల అవి తన కుటుంబసభ్యుల్లా మారిపోయావని ఆమె తెలిపింది. ఎర్త్‌ మిస్టరీ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఎలియన్స్‌పై తన శరీరాన్ని తరచూ పరిశీలించేవని, అలా చేస్తుంటే అవి తనను రేప్‌ చేస్తున్నాయా అనే భావన కలిగేదని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేదని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement