
బులంద్ షహర్: ఉత్తర ప్రదేశ్‌లో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేయడంతో పాటు, ఆమెపై అత్యాచారం అనంతరం హత్య చేశారు. బులంద్ షహర్‌లో 12వ తరగతి చదువుతున్న మైనర్ యువతి మంగళవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ట్యూషన్ ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న యువతిని.. కొందరు యువకులు మారుతీ ఆల్టో కారులో కిడ్నాప్ చేశారు. రెండు రోజులు పాటు యువతిపై అత్యాచారం జరిపి.. ఆపై హత‍్య చేశారు. శవాన్ని ఒక సరస్సు పక్కన పడేసి అదేకారులో దుండగులు వెళ్లిపోయారు.
ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న యువతిని పట్టపగలు కిడ్నాప్ చేస్తున్న ఘటన సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారం మేరకు పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూపీలోని విపక్ష పార్టీలన్నీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment