భూస్వామి భార్యను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మహ్మద్ సలీంకు న్యూఢిల్లీ కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి టి.ఆర్.నావల్ శనివారం ఆదేశించారు. అంతేకాకుండా రూ. 24 వేలు జరిమాన విధించారు. అయితే నిందితుడు టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు అతని తరపు న్యాయవాదులు జడ్జికి తెలపడంతో జరిమానాను రూ. 15 వేలకు తగ్గించారు. ఆ మొత్తాన్ని అత్యాచారానికి గురైన బాధితురాలికి అందజేయాలని సూచించారు.
2011, జులై 22న కూరగాయలు కొనుగోలు చేసేందుకు భూస్వామి భార్య మార్కెట్కు బయలుదేరింది. ఆ క్రమంలో తాను తోడు వస్తానని వారి వద్ద పని చేసే సలీం అడగడంతో ఆమె సరే అంది. దాంతో మార్గం మధ్యలో ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. దాంతో ఆమె సృహ కోల్పొయింది. దీంతో ఆమెపై ఘజియాబాద్ తీసుకువెళ్లాడు. అనంతరం ఓ గదిలో బందీగా ఉంచి ఆమెపై వరుసగా ఆరురోజులు అత్యాచారం జరిపాడు.
భార్య ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో భాగంగా ఆమె ఘజియాబాద్లో ఉన్నట్లు భర్త తెలుసుకుని, ఆమెను న్యూఢిల్లీ తీసుకు వచ్చారు. అనంతరం భూస్వామి పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ ఆపై అత్యాచారం కేసులో సలీం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్షను ఖరారు చేశారు.