Mohammed Salim
-
విభజించి పాలిస్తున్న బీజేపీ
సాక్షి, నెల్లూరు రూరల్: ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ.. విభజించు..పాలించు విధానంలో పాలన సాగిస్తోందని ఆలిండియా డీవైఎఫ్ఐ (డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మాజీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ఎంపీ మహ్మద్ సలీం ఆరోపించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం నెల్లూరులో ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లూరు నగరంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్తకి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, 16 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలో వేస్తామనే హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మూడున్నరేళ్లు అయినా ఇప్పటికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. నిరుద్యోగం పెరగడానికి బీజేపీ అవలంబిస్తోన్న ఆర్థిక విధానాలే కారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మోసం చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్.. సంఘ్‌పరివార్‌కు త్రిశూలాలు, కరవాలాలు అందజేసి భయానక వాతావరణం కల్పిస్తోందని చెప్పారు. వామపక్షవాదులుగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఈ సభలో డీవైఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు పాల్గొన్నారు. -
అవేం మాటలు.. మానవత్వం లేదా?
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ: కశ్మీర్లో డర్టీ వార్ కొనసాగుతోందని, ఈ యుద్ధంలో వినూత్న పద్ధతుల్లో పోరాడాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయన దేశ అంతర్గత భద్రతపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించాయి. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ రాజకీయ వివాదాలకు కేంద్రం కావడం దురదృష్టకరమన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సింది సైన్యం కాదని, రాజకీయ నాయకత్వమని తేల్చిచెప్పారు. రావత్ వాడుతున్న భాష తాను చిన్నప్పటి నుంచి వింటున్న భారత సైన్యానిది కాదని సీపీఐ(ఎం) నేత మహ్మద్ సలీం విమర్శించారు. రావత్ మాటలు వింటే ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యనించారు. రావత్ రాజకీయ వ్యాఖ్యల్ని చేయడం మానుకోవాలని జనతాదళ్ యునైటెడ్ నాయకుడు కె.సి.త్యాగీ తెలిపారు. వేర్పాటువాద సంస్థ హురియత్‌తో కాకపోయినా సాధారణ కశ్మీరీలతో సైన్యం సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని త్యాగీ సూచించారు. కశ్మీర్ సమస్యను కేవలం శాంతి భద్రతల కోణంలో మాత్రమే చూడలేమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా స్పష్టం చేశారు. నిరంతరం చర్చలు జరపడంతో పాటు కశ్మీరీ యువత పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. కశ్మీరీ యువత భద్రతా బలగాలపై రాళ్లు విసరడమన్నది చాలా తీవ్రమైన సమస్యని ఝా అభిప్రాయపడ్డారు. మరోవైపు రావత్ వ్యాఖ్యల్ని కేంద్ర పట్టాణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు సమర్థించారు. ‘కశ్మీర్లో పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యనైనా తీసుకుంటామని రావత్ చెప్పారు. నేను దాన్నే సమర్థిస్తున్నాను’ అని వెంకయ్య ట్విటర్లో తెలిపారు. -
భూస్వామి భార్యపై అత్యాచారం కేసులో నిందితునికి జైలు శిక్ష
భూస్వామి భార్యను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మహ్మద్ సలీంకు న్యూఢిల్లీ కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి టి.ఆర్.నావల్ శనివారం ఆదేశించారు. అంతేకాకుండా రూ. 24 వేలు జరిమాన విధించారు. అయితే నిందితుడు టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు అతని తరపు న్యాయవాదులు జడ్జికి తెలపడంతో జరిమానాను రూ. 15 వేలకు తగ్గించారు. ఆ మొత్తాన్ని అత్యాచారానికి గురైన బాధితురాలికి అందజేయాలని సూచించారు. 2011, జులై 22న కూరగాయలు కొనుగోలు చేసేందుకు భూస్వామి భార్య మార్కెట్‌కు బయలుదేరింది. ఆ క్రమంలో తాను తోడు వస్తానని వారి వద్ద పని చేసే సలీం అడగడంతో ఆమె సరే అంది. దాంతో మార్గం మధ్యలో ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. దాంతో ఆమె సృహ కోల్పొయింది. దీంతో ఆమెపై ఘజియాబాద్ తీసుకువెళ్లాడు. అనంతరం ఓ గదిలో బందీగా ఉంచి ఆమెపై వరుసగా ఆరురోజులు అత్యాచారం జరిపాడు. భార్య ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో భాగంగా ఆమె ఘజియాబాద్‌లో ఉన్నట్లు భర్త తెలుసుకుని, ఆమెను న్యూఢిల్లీ తీసుకు వచ్చారు. అనంతరం భూస్వామి పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ ఆపై అత్యాచారం కేసులో సలీం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్షను ఖరారు చేశారు.