హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది | Thane girl abducted, sold in Gujarat, reunited with family | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది

Published Thu, Jun 18 2015 1:58 PM | Last Updated on Mon, May 28 2018 1:37 PM

హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది - Sakshi

హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది

థానే: ఎట్టకేలకు ఓ పద్నాలుగేళ్ల బాలిక కిడ్నాపర్ల చెర నుంచి బయటపడింది. దాదాపు నెల రోజుల అనంతరం తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఉలన్ సాగర్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక గత మే 9నుంచి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తప్పిపోయినవారి జాబితాలో చేర్చి కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపులు మొదలు పెట్టారు. అయితే, పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నెల జూన్ 16న ఆ బాలిక బందీల చెరనుంచి తప్పించుకుని ముంబయిలోని దాదార్ ప్రాంతానికి చేరుకుంది.

ఆమెను పోలీసులు చివరికి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం కిడ్నాపర్లు ఆమెను గుజరాత్ తీసుకెళ్లి అమ్మేశారు. ఇందులో పూజా షద్దార్ అలియాస్ రుమా, శోభా జాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆ బాలికను గుజరాత్లోని గోవింద్ మఖ్వానా (60) అనే వ్యక్తికి రూ.65 వేలకు అమ్మేసినట్లు వివరాలు వెల్లడించారు. దీంతో పోలీసులు మఖ్వానాను, రాజు వాజా అనే ఆటో రిక్షా డ్రైవర్ను అరెస్టు చేశారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement