దశాబ్దాల సర్వీసున్నా తప్పని దిగులు
రెన్యువల్స్ పూర్తిచేయని సర్కారు
4నెలలుగా అందని జీతాలు
కాంట్రాక్టు లెక్చరర్లతో ఇబ్బందులు
శ్రీకాకుళం న్యూకాలనీ:ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగానే విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని అర్హతలు, అనుభవం,ప్రతిభ ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ లెక్చరర్ల(సీఎల్స్)పై రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 2015-16 విద్యాసంవత్సరానికి డిసెంబర్ 31వరకే రెన్యువల్స్ చేశారు. ఈ తేదీ ముగిసినా ఇప్పటివరకూ రెన్యువల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు జారీకాలేదు. దీంతో సీఎ ల్స్ అయోమయంలో ఉన్నారు. 4నెలలుగా వీరికి జీతాలు కూడా అందడం లేదు.
470 మంది వరకు సీఎల్స్..
జిల్లాలోని 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 12 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లో 390 మంది, డిగ్రీ కళాశాలల్లో దాదాపు 70 మంది వరకు జనరల్ సబ్జెకులకు, ఒకేషనల్ కోర్సుల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో 120 మంది మహిళలు ఉన్నారు. మెజారిటీ సీఎల్స్ 8 ఏళ్లకుపైబడి నుంచి పనిచేస్తున్నారు. కనీసం 50 శాతం మంది దశాబ్దం పూర్తిచేసుకున్నవారు సైతం ఉన్నారు. గతంలో పార్డుటైం, గంటల ప్రాతిపదికన ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులను తీసుకునేవారు.
కాంట్రాక్ట్ వ్యస్థకు బీజం
2000లో అప్పటి ప్రభుత్వం పార్ట్‌టైం స్థానంలో కాంట్రాక్టు వ్యవస్థకు బీజం వేశారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు గుర్తుచేస్తున్నారు. అక్కడి నుంచి వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం రూ.నెలకు 18వేలు చెల్లిస్తున్నా షరతులుపేరిట నరకయాతన చవిచూస్తున్నామని సీఎల్స్ వాపోతున్నారు. ఇన్నేళ్గు పనిచేస్తున్నా ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు లేవు. కనీసం భద్రత లేని ఉద్యోగాలతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని వీరంతా ఆందోళన చెందతున్నారు.
రెన్యువల్స్ గడువు ముగిసినా..
2015-16 విద్యాసంవత్సరానికి సీఎల్స్‌కు డిశంబర్ 31వరకే రెన్యువల్స్ చేశారు. గడువు ముగిసినా దీనిపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పాఠాలు బోధిస్తునే మరోపక్క అభద్రతాబావానికి గురవుతున్నారు.
తెలంగాణాలో మాదిరి రెగ్యులర్ చేయాలి
ఐదేళ్లు అనుభవం ఉన్న కాంట్రాక్టు లెక్చలర్లును తెలంగాణా రాష్ట్రంలో రెగ్యులర్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం జీవోలను విడుదలచేసింది. పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న విధానం ఇక్కడెందుకు వీలుకాదు. రెన్యువల్స్‌ను పొడిగిస్తున్నట్లు వెంటనే ప్రకటించాలి. బకాయి జీతాలు విడుదలచేయాలి.
- డి. అక్ష్మున్నాయుడు, అధ్యక్షుడు,
జిల్లా కాంట్రాక్టు లెక్చలర్లు సంఘ ప్రతినిధి
చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి
రెగ్యులరైజ్ చేస్తానని 2014 తన ఎన్నికల మేనిఫేస్టోలో చంద్రబాబు హామీఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు విన్నావించాం. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు తన హామీని నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలి.
- కె.బాలకృష్ణ, జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం
అధ్యక్షులు
క్రమబద్ధీకరణ ప్రభుత్వ నిర్ణయం
రెన్యువల్స్ గడువు ముగిసినమాట వాస్తవమే. సీఎల్స్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కజిల్లాకే పరిమితమైనదికాదు. రాష్ట్రవ్యాప్త సమస్య. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. బకాయి జీతాలకు చర్యలు తీసుకుంటాం.
- ఆర్.పున్నయ్య, డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య
అభద్రత అంచున..బోధన
Published Thu, Feb 25 2016 12:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement