ప్రేమించలేదని ఆత్మాహుతియత్నం | Not loving commit suside | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని ఆత్మాహుతియత్నం

Published Sat, May 16 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

ప్రేమించలేదని ఆత్మాహుతియత్నం

ప్రేమించలేదని ఆత్మాహుతియత్నం

ఓ యువకుని దుశ్చర్య

 హైదరాబాద్: ప్రేమించిన యువతి తన ప్రేమ ను నిరాకరించిందని ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లికార్జున్ స్థానికంగా ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన యువతి ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్‌కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. వీరిద్దరికీ చిన్ననాటినుంచి పరిచయం ఉండటంతో మల్లికార్జున్ తరచూ యువతిని కలవడానికి హాస్టల్‌కు వెళ్లేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఆ యువతి వద్దకు వచ్చి ప్రేమించమని అడిగాడు. ఆమె తనను ఇబ్బందిపెట్టొద్దని చెప్పినా వినలేదు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను  ఒంటిపై పోసుకుని నిప్పంటిం చుకున్నాడు. వెంటనే యువతి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయ గా ఆమె చేతులూ కాలాయి. హాస్టల్ సిబ్బంది అతడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చారు. 40% వరకు గాయపడ్డాడని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement