షంషేర్ | Nandamuri kalyanram new movie Share | Sakshi
Sakshi News home page

షంషేర్

Published Sat, Oct 3 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

షంషేర్

షంషేర్

ఈ యువకుడు చూడటానికి చాలా సైలంట్, కానీ ఏదైనా తప్పు జరిగితే మాత్రం వయొలెంట్‌గా రియాక్టవుతాడు. షేర్‌లా విరుచుకుపడతాడు. ఇటీవల ‘పటాస్’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన నందమూరి కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్వకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక.

ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ చిత్రం పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘అని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. కల్యాణ్‌రామ్ కెరీర్‌లో మరో పెద్ద హిట్‌గా నిలుస్తుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement