
అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ తుది పోరులో ఓడిపోతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమైంది. ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్‌లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన సింధు నేటి నుంచి మొదలయ్యే జపాన్ ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది.
మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జపాన్ అమ్మాయి, ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషితో మూడో ర్యాంకర్ సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 2–2తో సమఉజ్జీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment