చాంప్స్‌ ప్రణీత, సంకేత్‌రెడ్డి | Praneeth, Sanketh Reddy got Titles in Under 11 Chess Selections | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ ప్రణీత, సంకేత్‌రెడ్డి

Published Mon, Jul 2 2018 10:15 AM | Last Updated on Mon, Jul 2 2018 10:15 AM

Praneeth, Sanketh Reddy got Titles in Under 11 Chess Selections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్‌ జిల్లా అండర్‌–11 చెస్‌ సెలక్షన్‌ టోర్నీలో ప్రణీత ప్రియ, సంకేత్‌ రెడ్డి చాంపియన్‌లుగా నిలిచారు. టీఎస్‌సీఏ కార్యాలయం వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభాగంలో 4 పాయింట్లతో ప్రణీత అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తలపడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఎస్‌. అనీష్క, జి. ఇషాన్వి, జి. శరణ్య వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి హైదరాబాద్‌ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.

బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లకుగానూ 5 పాయింట్లు సాధించి సంకేత్‌ విజేతగా నిలిచాడు. ఎస్‌. చిద్విలాస్‌ రెండోస్థానాన్ని దక్కించుకోగా... కె. అవనీశ్, విశ్వ తర్వాతి స్థానాలను సాధించారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ నలుగురూ హైదరాబాద్‌ జిల్లా బాలుర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్లు రాష్ట్ర స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయి.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement