మండలంలోని యర్రగుంట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి చెందాడు.
గార్లదిన్నె(అనంతపురం): మండలంలోని యర్రగుంట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సర్వజనాస్పత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సైదన్న కుమారుడు ప్రణీత్(25) వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనాల్లో మండలంలోని పెనకచెర్లడ్యాంకు బయల్దేరాడు.
యర్రగుంట్ల గ్రామంలో పిల్లకాలువ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో ప్రణీత్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతనిపై వెళ్లింది. దీంతో అతను కొంతదూరం ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతని 108లో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ కేసు నమోదు చేశారు.