సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌కు అండగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్‌రావు వెల్లడించిన సంగతి తెలిసిందే.
2018 నుంచే అక్రమ ట్యాపింగ్ దందా మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఇజ్రాయిల్ నుంచి అత్యాధునిక ఉపకరణాలు ఖరీదు చేయగా, రామ్ గోపాల్ కన్సల్టెంట్, అడ్వైజర్‌గా వ్యవహరించారు. ఆదిలాబాద్ ఘర్షణ సమయంలో అక్కడ వినియోగించినట్లు గుర్తించారు. ప్రణీత్‌రావు కేసులో మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు.
కాగా, మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండగా ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్‌ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్‌ఐబీలో ఉన్న ఇతర ఇన్‌స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment