ప్రణీత్‌రావుతో చాటింగ్‌ చేసిన బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత? | BRS Leader Involved In Telangana Phone Tapping Scam, Know Details Inside - Sakshi
Sakshi News home page

ప్రణీత్‌రావుకు 100 ఫోన్‌నెంబర్లు వాట్సాప్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నేత?

Published Fri, Mar 15 2024 9:49 AM | Last Updated on Fri, Mar 15 2024 12:21 PM

BRS Leader Involved In Telangana Phone Tapping Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై.. విచారణ ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్‌రావు ఫోన్లను సీజ్‌ చేసిన స్పెషల్‌ టీం.. ఆ ఫోన్లలోని వాట్సాప్‌ ఛాటింగ్‌లను రిట్రీవ్‌(డిలీట్‌ చేసిన సమాచారాన్ని సేకరించడం) చేసినట్లు తెలుస్తోంది. ఈ వాట్సాప్‌ సంభాషణలనే కీలకంగా భావిస్తూ.. దర్యాప్తులో ముందుకెళ్లాలని భావిస్తోంది.  

ప్రణీత్‌రావు ఛాటింగ్‌లో ఓ బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ నేత ఇచ్చిన సూచనల మేరకే ప్రణీత్‌ కొంత మంది ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు విచారణ బృందం గుర్తించింది. బీఆర్ఎస్‌కు చెందిన ఆ ముఖ్యనేత వంద ఫోన్‌ నెంబర్లు ప్రణీత్ రావు ఇచ్చారని..  ఆయా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేయాలని ప్రణీత్‌రావును ఆదేశించారని తెలుస్తోంది. 

.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు?.. ఎక్కడ కలుస్తున్నారు? అనే వివరాల్ని ఆ బీఆర్‌ఎస్‌ నేత ప్రణీత్‌రావు నుంచి కోరినట్లు సమాచారం.  ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి సోదరులు, అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ల ఫోన్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్‌ చేశారు. అంతేకాదు  ట్యాపింగ్‌ చేసిన ఆ సమాచారాన్ని రాత్రికి రాత్రే ప్రణీత్‌రావు ఆ బీఆర్‌ఎస్‌ పెద్దకు చేరవేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో.. ప్రణీత్‌రావు గతంలో చెప్పిన పోలీసు అధికారులతో(మాజీలు) పాటు సదరు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతను సైతం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు ఆ ముఖ్యనేత ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా ఇప్పుడు నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement