బాలుడి బుర్రలో కత్తి
తొలగించిన కేజీహెచ్ వైద్యులు
విశాఖపట్నం: తుపానులో నేలకొరిగిన చెట్టు కొమ్మలు కొడుతుండగా పిడి నుంచి వేరుపడిన కత్తి ప్రమాదవశాత్తూ ఓ బాలుడి తలలో గుచ్చుకుపోయింది. భీమిలి మండలం తిమ్మాపురం గ్రామంలో ఈనెల 16న జరిగిన సంఘటన వివరాలు....ఎన్.సురేష్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో నేలకొరిగిన చెట్టుకొమ్మలను కత్తితో తొలగిస్తుండగా కత్తి పిడి నుంచి వేరై సమీపంలో వున్న కుమారుడు ఈశ్వరరావు తలలో 5 సెం.మీ లోతున గుచ్చుకుంది. కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి బాలుడి తల నుంచి కత్తిని తొలగించారు.