heaven
-
ఆకాశంలో వింత.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! స్వర్గానికి దారి ఇదేనా?
ఈ విశ్వంలో మనకు తెలియని వింతలు విడ్డూరాలు చాలానే ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి బోలెడు అంతుచిక్కని విషయాలను బయటపెట్టిన అవి ఈ విశ్వంలో ఉన్నవాటితో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. అప్పుడప్పుడు ఆకాశంలో ఏవో మెరుపులు, వింతలు కనపడడం వాటిని చూసి ఔరా అనుకుంటుంటాం. అలానే దాని గురించి పూర్తిగా తెలియకపోయినా మనకు నచ్చిన, తెలిసిన వాటితో పోలుస్తుంటాం. తాజాగా మేఘావృతమైన ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదేమై ఉంటుందని నెట్టింట ప్రస్తుతం చర్చణీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి ఓ వింత ప్రత్యక్ష్యమైంది. అది చూసేందుకు ఎలా ఉందంటే.. ఆకాశంలో ఉన్న భవనానికి సంబంధించిన తలుపులులా కనిపిస్తూ.. దాని వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తోంది. ఇక దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారి రచ్చ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఏమై ఉండవచ్చు? అని ఎవరికి నచ్చిన కామెంట్లు వాళ్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఇది స్వర్గానికి దారి అయ్యిండచ్చని కామెంట్ పెట్టగా.. మరికొందరేమో ఇదేంటో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకొందరేమో మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. A mysterious shadow (object?) was seen in Bengaluru skies last night near Hebbal flyover. Did anyone else see? What could this possibly be? A shadow of a building? If it is, then what could possibly be the science behind it? Credits: @SengarAditi pic.twitter.com/8YOIzvIsPv — Waseem ವಸೀಮ್ وسیم (@WazBLR) July 23, 2023 -
స్వర్గంలో తోడు
ప్రవక్త మూసా (అస) అల్లాహ్ తో ‘‘ఓ అల్లాహ్.. స్వర్గంలో నాతోపాటు ఎవరుంటారు?’’ అని అడిగారు. ‘‘ఫలానా కసాయి స్వర్గంలో నీతోపాటు ఉంటాడు’’ అని అల్లాహ్ బదులిచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ (స)కు పూర్వపు ప్రవక్తలలో మూసా ఒకరు. ప్రవక్త మూసా (అలై) ఆ కసాయి ఎలా ఉంటాడో అని చూసేందుకు వెళ్లారు. కసాయి అప్పుడే మాంసాన్ని అమ్మి మిగిలిన మాంసపు ముద్దను సంచిలో వేసుకుంటున్నాడు. అతన్ని చూసి మూసా ‘ఈ కసాయి నాతో స్వర్గంలో ఉంటాడా’ అని ఆశ్చర్యపోయారు. మూసా (అలై) ఆ కసాయిని వెంబడించారు. కసాయి ఇంటికి చేరుకోగానే ప్రవక్త మూసా కసాయి అనుమతి తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. ఆ కసాయి స్వర్గానికి అర్హత సాధించేంత గొప్ప పనులేమి చేశాడో చూద్దామనే ఆత్రుతతో ఉన్నారు. అంతలోనే కసాయి తన సంచిలో నుంచి మాంసం ముద్ద తీశాడు. ముక్కలుగా కోసి కూర తయారు చేశాడు. గోధుమపిండిని బాగా కలిపి వేడి వేడి రొట్టెలు సిద్ధం చేశాడు. రొట్టెలను పళ్లెంలో వేసుకుని కూరను గిన్నెలో వేసుకున్నాడు. పక్కనే మంచంలో మూలుగుతున్న వృద్ధురాలిని ఎంతో ఆప్యాయంగా లేపి కూర్చోబెట్టాడు. తన ఒళ్లో కూర్చోబెట్టుకుని రొట్టెను ముక్కలు చేసి ఆమెకు తినిపించసాగాడు. కడుపారా తినిపించి మూతిని శుభ్రం చేసి నీళ్లు తాగించి తిరిగి నిద్రపుచ్చబోయేసరికి ఆ ముసలామె ఏవో మాటలు చెప్పింది. ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు ప్రవక్త మూసా (అలై)కు వినిపించలేదు. మూసా ఎంతో ఆత్రుతతో ‘‘ఈమె ఎవరు, ఏదో చెబుతుంది ఏమిటి?’’ అని అడిగారు. ‘‘నేను ఒక కసాయిని. ఈమె నా కన్నతల్లి. రోజూ బయటికెళ్లేముందు అమ్మకు అన్నిసేవలు చేసి వెళతాను. తిరిగి ఇంటికి వచ్చాక అమ్మ అవసరాలన్నీ తీరాకే నా పిల్లల, నా అవసరాలు తీర్చుకుంటాను.‘‘ అని కసాయి చెప్పాడు. ‘‘మీ అమ్మ నీ చెవిలో ఏమి చెప్పింది?’’ అనడిగారు. ‘‘రోజూ చెప్పేదే అది. ‘‘అల్లాహ్ నిన్ను స్వర్గంలో మూసా (అలై) వెంట ఉంచుగాక‘‘ అని రోజూ దీవిస్తుంటుంది. అయినా నేనొక చిన్న కసాయిని. నేనెక్కడా, ప్రవక్త మూసా (అలై) ఎక్కడా! ఇది అయ్యే పనేనా’’ అని నవ్వుకున్నాడు. ‘‘నీ తల్లి దీవెనను అల్లాహ్ నిజం చేశాడు’’. అంటూ ప్రవక్త మూసా (అలై) కళ్లలో నీళ్లు తుడుచుకున్నారు. -
పాక్ ఉగ్ర స్వర్గధామమే: నిక్కీ హేలీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించబోదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధినాయకత్వానికి అమెరికా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ మాట్లాడారు. ‘ఉగ్రవాదుల ఏరివేత విషయమై గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్‌తో అమెరికా ప్రభుత్వ వైఖరి మారింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాలు ప్రపంచానికి నాయకత్వం వహించాలని హేలీ ఆకాంక్షించారు. -
మాయా ఉంగరం
అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప వాళ్ల తాతయ్యతో కలిసి నివసిస్తుండేది. అది శీతాకాలం. వాళ్ల తాతయ్య జబ్బు పడ్డాడు. అతనికి పొగతాగే అలవాటుంది. తాతయ్య పొగాకు కోసం, పాప బయటికొచ్చింది. వాళ్ల ఇంటి పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉంది. దానికి అవతల పొగాకు అమ్మే దుకాణం ఉంది. అక్కడకు వెళ్లింది పాప. పొగాకు కొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రైల్వేస్టేషన్లో సైనికులు కనపడ్డారు. ‘‘పాపా, ఏంటి నీ చేతుల్లో ఉన్నది’’ అడిగాడు ఓ సైనికుడు. ‘‘మా తాతయ్య కోసం పొగాకు తీసుకెళ్తున్నాను’’ అంది పాప. ‘‘నాకు కొంచెం అమ్ముతావా?’’ అన్నాడు సైనికుడు. ‘‘లేదు’’ అంది పాప. చిన్నబోయాడు సైనికుడు. ‘‘కొంచెం ఊరికెనే ఇస్తాను’’ అని ఆ సైనికుడికి కొంచెం పొగాకు ఇచ్చింది. ఎంతో ఆనందించిన సైనికుడు పాపకి బహుమతిగా ఓ ‘మాయా ఉంగరం’ ఇచ్చాడు. ‘‘ఇది అద్భుతమైన ఉంగరం. ఈ ఉంగరాన్ని మధ్యవేలుకు పెట్టుకుంటే, నీవు, మీ తాతయ్య ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉంగరాన్ని చూపుడువేలుకి పెట్టుకుంటే, నీవు చాలా ఆనందంగా ఉంటావు’’అన్నాడు సైనికుడు. ఆ సైనికుడికి మంత్రవిద్యలు తెలుసు. పాప ఆనందంతో మాయా ఉంగరాన్ని తీసుకుని సైనికునికి కృతజ్ఞతలు చెప్పింది. దారిలో వెళ్తూ ఆ మాయా ఉంగరాన్ని చిటికెన వేలుకు పెట్టుకుంది. పాప చిటికెన వేలు బాగా చిన్నది. ఉంగరం కొంచెం పెద్దది. కాబట్టి అది జారి మంచులో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఏడుస్తూ ఇంటికి పోయి, జరిగిన కథంతా వాళ్ల తాతకు చెప్పింది. తాతకు పొగాకు ఇచ్చింది.‘‘బాధపడకు, మన ఉడుత నీకు సాయం చేస్తుందేమో అడుగు’’ అని సలహా ఇచ్చాడు తాతయ్య.పాప ఉడుతని సాయమడిగింది. ఉడుత ముందు కొంచెం బెట్టు చేసింది. చివరికి ఒప్పుకుంది. ఉడుత, పాప కలిసి రోజూ ఆ ఉంగరం కోసం వెతికేవాళ్లు. చివరికి ఓ రోజు మాయా ఉంగరం పాపకు దొరికింది. పాప ఆనందానికి అవధుల్లేవు. ఉడుతకు కృతజ్ఞతలు చెప్పింది. మాయా ఉంగరాన్ని మధ్య వేలుకు ధరించింది. ఇంటికొచ్చి చూసేసరికి తాతయ్య ఆరోగ్యంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు.‘‘చిన్నారీ! నీవు బయటకు వెళ్తూ తలుపు మూయలేదు. తాజా గాలి గదిలోకి వచ్చింది. నా జబ్బు నయం చేసింది’’ అన్నాడు తాతయ్య.ఉంగరం విశేషం చెప్పింది పాప. తాతయ్య వంట చెరకు నరకడం లాంటి పనుల్లో పడ్డాడు. వంట చేయడానికి పాప, తాతయ్యకు సాయంచేసేది. తరువాతి రోజు పాప మాయా ఉంగరాన్ని తన చూపుడువేలుకు పెట్టుకుంది.వాళ్ల ఇంటిపక్కనున్న అడవి ఎంతో ప్రకాశవంతంగా వెలిగింది. చెట్లు పువ్వులు పూశాయి. పండ్లను కాశాయి. నీలి ఆకాశం ఎంతో అందంగా మెరిసింది. సూర్యుడు మబ్బుల వెనక నుంచి ఠీవిగా బయటకు వచ్చాడు. ఈ దృశ్యాలను చూసి పాప, తాతయ్య, ఉడుత ఆనందంతో నృత్యం చేశారు. వాళ్లు ఈ రోజుకీ ఆనందంగానే ఉన్నారు. - స్వేచ్ఛానువాదం : అనిల్ బత్తుల -
స్వర్గంలో దేవదాస్
స్వర్గంలోని ‘హెవెన్స్టార్ లెవెన్స్టార్ పార్క్’ అది. పార్క్‌లో ఒక మూల బెంచీపై కూర్చొని ఎత్తిన సీసా దించకుండా చాలా సిన్సియర్‌గా మందు కొడుతున్నాడు దేవదాస్. అటువైపుగా వచ్చిన పార్వతి దేవదాస్‌ను చూసింది. ‘‘దేవదాను చూసి ఎన్ని దశాబ్దాలైందో!’’ అనుకుంటూ బెంచీ వెనక్కి వెళ్లి దేవదాస్ కళ్లు మూసి... ‘‘దేవదా... నేనెవరో చెప్పుకో చూద్దాం’’ అని చిలిపిగా అడిగింది. ‘‘నువ్వెవ్వరో చెప్పుకోలేనుగానీ... నువ్వు చేపలపులుసుతో భోజనం చేశావని మాత్రం చెప్పగలను. చేతులను మంచి సోప్‌తో కడుక్కొని ఉండాల్సింది’’ అన్నాడు దేవదాస్. ‘‘నేను ఏ పులుసుతో తింటే నీకేంగానీ...నేనెవరో చెప్పుకోచూద్దాం?’’ మరోసారి అడిగింది పార్వతి. ‘‘మందు కొడితే అద్దంలో నన్ను నేనే గుర్తు పట్టలేను. అలాంటిది ఈ సమయంలో వెనక నుంచి వచ్చి కళ్లు మూస్తే ఎలా గుర్తు పట్టగలను?’’ అన్నాడు దేవదాస్. ఇక లాభం లేదనుకొని అతని ముందుకు వచ్చి నిల్చుంది పార్వతి. ‘‘పారూ...నువ్వా!!’’ ఆశ్చర్యానందాలతో అరిచాడు దేవదాస్. తమ చిన్నప్పటి విషయాలను గుర్తు తెచ్చుకొని ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ‘‘దేవదా... ఇంకా మందు కొడుతూనే ఉన్నావా! నన్ను మరిచిపోవడం కష్టంగా ఉందా?’’ సానుభూతిగా అడిగింది పార్వతి. ‘‘పిచ్చి పారూ....అప్పుడెప్పుడో సెవెంటీస్లోనే నిన్ను మరిచిపోయాను. కానీ మందును మాత్రం మరవలేకపోతున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘నన్ను మరిచిపోయినందుకు బాధ పడటం లేదు. ఈ కాల కూట విషాన్ని తాగుతున్నందుకు మాత్రం బాధ పడుతున్నాను. నా కోసం మందు మానలేవా?’’ ‘‘ఈరోజు నుంచే మానేస్తున్నాను’’ ఖాళీ అయిన సీసాను ముళ్లపొదల్లోకి విసురుతూ అన్నాడు దేవదాస్.‘‘దేవదా...నేనంటే ఎంత ప్రేమ నీకు?’’ పొంగిపోయింది పార్వతి. ‘‘ ప్రేమ కాదు... మలేరియా దోమ కాదు....నీ కోసం కాదు...ఆ మేనక కోసం మానేస్తున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘మేనక కోసమా!!!’’ నలుదిక్కులూ అదిరేలా ఆశ్చర్యపోయింది పార్వతి. ‘‘ఈ స్వర్గానికొచ్చాక తిలోత్తమతో త్రీ టైమ్స్ లవ్‌లో పడ్డాను. ఎప్పటిలాగే బ్రేకప్! ఇక పొరపాటున కూడా లవ్‌లో పడొద్దని డిసైడైపోయాను. అనుకున్నావు అని ఆగవు కొన్ని...అని ఎవరో అన్నట్లు.... విధివశాత్తు మళ్లీ ప్రేమలో పడిపోయాను. అదేలా జరిగిందంటే... ఒక రోజు నేను ఈ పార్క్‌లో కూర్చొని ఏమీ తోచక... ‘కళ్లు కళ్లు ప్లస్సు /వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చ్వేషన్’ పాట పాడుకుంటున్నాను. అప్పుడే ఇటు వైపుగా వచ్చిన మేనక, తనను చూసే నేను పాడుతున్నట్లు టెంప్టయిపోయింది. ‘‘మీకు అంతగా నచ్చానా!’’ అంటూ నా దగ్గరకు వచ్చి సిగ్గుపడిపోయింది. ‘‘యా!’’ అని చిన్న అబద్ధం ఆడాను. అలా మేనక ప్రేమలో పడిపోయాను. ‘‘మేనూ...నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడిగాను. ‘‘తప్పకుండా. కానీ మీరు ముందు ఈ మందు కొట్టడం మానేయాలి’’ అని షరతు పెట్టింది. ‘‘ఆరోజు ప్రేమ కోసమే మందు కొట్టాను. ఈరోజు ప్రేమ కోసమే మానేస్తున్నాను. ఇక ముందు నైన్టీ ఎమ్.ఎల్ కూడా తీసుకొను’’ అని మాట ఇచ్చాను. ఇదే చివరిరోజు. ఇక ఎప్పుడూ మందు ముట్టను. ఎల్లుండి వాలెంటెన్స్ డే రోజు మా పెళ్లి ఘనంగా జరగనుంది. మన పొరుగు రాష్ట్రమైన నరకం నుంచి కూడా మా పెళ్లి చూడటానికి చాలామంది వస్తున్నారు’’ ఆనందంగా అన్నాడు దేవదాస్. ‘‘ఈరోజు గొప్ప శుభవార్త విన్నాను. తప్పకుండా నీ పెళ్లికి వస్తాను’’ అని చీరకొంగుతో ఆనంద భాష్పాలు తుడుచుకుంది పార్వతి. దేవదాస్ తన చేతికి ఉన్న వాచ్ చూసుకుంటూ... ‘‘పారూ... నా పెళ్లిలో కలుద్దాం’’ అని కోటు జేబులో రెండు చేతులను దూర్చి ‘ఒక మేనక కోసం.... టక్ టక్ టక్.... తిరిగాను స్వర్గం... లక్ లక్ లక్’’ అని పాడుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఆరోజు వాలెంటెన్స్ డే. కొత్త పట్టుచీర కట్టుకొని ‘షాన్పారేషాన్’ ఫంక్షన్‌హాల్‌కు వెళ్లింది పారు. అక్కడ ఒక పురుగు కూడా లేదు. వెంటనే అక్కడి నుంచి ‘హెవెన్స్టార్ లెవెన్స్టార్’ పార్క్‌కు వెళ్లింది. పార్క్‌లో ఒక మూల కూర్చొని మందుకొడుతున్నాడు దేవదాస్. ‘‘పెళ్లని చెప్పావు... ఇక్కడున్నావేమిటి?’’ అడిగింది పార్వతి. ‘‘ఇంకెక్కడి పెళ్లి... క్యాన్సిల్ అయింది. అంతా ఆ తండ్రీకొడుకులే చేశారు’’ ఆవేదనగా అన్నాడు దేవదాస్. ‘‘వాళ్లెవరు?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘పృథ్వీరాజ్ కపూర్... ఆయన సన్ రాజ్‌కపూర్. ఏదో ఫంక్షన్లో రాజ్‌కపూర్ మేనకను చూసి పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టాడట. అప్పుడు పృథ్వీరాజ్‌కపూర్ మేనక తల్లి దగ్గరకు వెళ్లి ‘ఎలాగైనా సరే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి’ అని మ్యానేజ్ చేశాడు. ఆ మహాతల్లి ఓకే చెప్పింది. మా లవ్వులో నిప్పులు పోసింది’’ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు దేవదాస్.‘‘అసలు మేనక ఎలా ఒప్పుకుంది?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘ఆరోజు నువ్వు మీ నాన్న మాట కాదనలేక...నన్ను కాదన్నావు... ఈరోజు పారు వాళ్ల అమ్మ మాట కాదనలేక నన్ను కాదనుకుంది.... అంతే తేడా.... ఒక డాడీ, ఒక మమ్మీ నా జీవితాన్ని ఖాళీసీసా చేసేశారు! వోడ్కా మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇక ప్రేమ జోలికి ఎప్పుడూ వెళ్లను’’ నిర్వేదంగా అంటూ సిగరెట్ వెలిగించి పాట అందుకున్నాడు దేవదాస్...‘పారు లేదు/ పప్పు చారు లేదు/ మేను లేదు వాటర్క్యాను లేదూ/ వెలుతురే లేదు’ ఆ సమయంలోనే అటువైపుగా వస్తున్న రంభను చూసి సడన్‌గా పాట మార్చాడు దేవదాస్.‘కళ్లు కళ్లు ప్లస్సు/ వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చ్వేషన్’... అని పాడటం మొదలు పెట్టాడు.‘‘మీకు అంతగా నచ్చానా!’’ సిగ్గుతో మెలికలు తిరిగింది రంభ.‘పిచ్చ పిచ్చగా నచ్చావు’ అన్నాడు దేవదాస్. పారు బిత్తర పోయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది! – యాకుబ్ పాషా -
నన్నిలాక్కూడా బతకనివ్వవా?!
రోజులు గడుస్తున్నా ఏ దేవుడూ అతడి మొర ఆలకించలేదు. ఒక దీవికి సమీపంలో పడవ మునిగిపోయింది. ఒకే ఒక వ్యక్తి బతికి బట్ట కట్టి దీవి ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. అది మనుషులుండే దీవి కాదు. ఇతడొక్కడే మనిషి. భయపడ్డాడు. దేవుడిని ప్రార్థించాడు. నీళ్లలోంచి ఒడ్డున పడేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఒడ్డు నుంచి తనను తన దేశానికి చేర్చమని వేడుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఏ దేవుడూ అతడి మొర ఆలకించలేదు. చలికి, ఎండకు తట్టుకోలేకపోతున్నాడు. ఒడ్డున ఉన్న చెక్కలతో కష్టపడి చిన్న గది కట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నాడు. ఒక రోజు ఆ వ్యక్తి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లినప్పుడు ఆకాశంలో దట్టంగా పొగ కనిపించింది. ఆ పొగ ఎక్కడినుంచి వస్తోందా అని ఆ దారి వెంటే వెళితే.. చివరికి తన చెక్కగల గది కాలిపోతూ కనిపించింది. ఆ పొగ తన గదిదే! ‘భగవంతుడా.. నన్ను ఇలాక్కూడా బతకనివ్వవా?’ అని దేవుడిపై ఆగ్రహించాడు. కొద్దిసేపటికే అక్కడి ఒక నౌక వచ్చింది! అతడిని ఎక్కించుకుంది. ‘‘నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసిందీ’’ అని సంతోషంగా అడిగాడు ఆ వ్యక్తి. ‘‘ఆకాశంలోకి వ్యాపించిన పొగను చూసి వచ్చాం’’ అని చెప్పారు వాళ్లు. దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు అతను. దేవుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడో తెలీదు. ఆగ్రహించాడని అనుకుంటాం కానీ.. అది కూడా అనుగ్రహమే అయి ఉంటుంది. -
ఆ నలుగురు... ఒక ఆకాశం!
దఢేల్మని పెద్ద చప్పుడు.గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు.. రెప్పపాటులో అదుపు తప్పి.. ఏటవాలుగా రెండొందల మీటర్లు జారుకుంటూ వెళ్లి.. ముప్ఫయ్ అడుగుల దిగువన.. నీళ్లు తక్కువగా ఉన్న కాలువలోకి పడిపోయింది.పది నిమిషాల తర్వాత..ఆగి ఆగి, కీచురాళ్ల రొద. కాలువలోకి దొర్లి, సగం నుజ్జయినా... ఇంకా ఆగని ఇంజిను చప్పుడు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు, చీకటి మాత్రమే కలిగించగల ఒక రకమైన భయం.కాలువకట్ట మీద కారు అదుపు తప్పి, ఏటవాలుగా జారేటప్పుడే ఊడిపోయిన డోరులోంచి బయటపడ్డ ఒక ప్రాణి. పేరు అమర్. కాస్త ఇహంలోకి రాగానే...‘‘రేయ్! ఉన్నారా... ఉన్నారా పోయారా... పలకండ్రా...’’కాలువలోని చీకట్లోకి చూపులు గుచ్చుతూ... ‘‘అందరూ చచ్చారా? ఒక్కరైనా పలకండ్రా...’’ గాద్గదికంగా మారుతోన్న అసహాయత. అమాయకంగా ముడుచుకు పడుకున్న చీకటిని దౌర్జన్యంగా చీల్చుకుంటూ దూసుకుపోతోంది కారు. గుంతమయమైన రహదారి కారణంగా అది భారంగా అరుస్తోంది.‘‘అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు... ఈ నైట్‌డ్యూటీలు నాకు నచ్చలేదురా’’ కారు నడుపుతున్న అమర్ అన్నాడు, దృష్టిని రోడ్డు మీదే కేంద్రీకరించి.‘‘మనం చేసేవి దానధర్మాలు కాదు; దందాలు. వీటిని రాత్రుళ్లే చేస్తారు’’ తాపీగా చెప్పాడు, అతని పక్కనే కూచున్న సత్య. బ్యాక్ సీట్లో కూచున్న రాకేశ్, శ్రీను పెద్దగా నవ్వారు.‘‘ఏమైనా చెప్పురా, మనం అంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండాల్సింది కాదు’’.‘‘ఎపిసోడ్ సమస్తమూ దుర్మార్గమేరా. మళ్లీ అందులో అంత స్పెషల్ సీన్లేమిటి?’’ సత్య ప్రశ్నించాడు.‘‘అదేరా, బాబును బావిలో వేస్తామని బెదిరించటం’’ అమర్‌లో ఏదో బాధ.‘‘మనోడింకా రాటు తేలలేదురా!’’ శ్రీను హేళన.‘‘ఎలా రాటుదేల్తాడు? నెలకో రెణ్నెల్లకో ఓ సెటిల్మెంటుకొస్తాడు. రెగ్యులర్‌గా మనతో ఉంటే, ఇవన్నీ అలవాటవుతాయి’’ రాకేశ్ మాట తడబడుతోంది, మందు ప్రభావంతో.‘‘మనం ఇష్టపూర్వకంగా ఇందులో దిగాం. వాడు మినిస్టర్‌కు స్వయానా బావమరిది కావడంతో తప్పనిసరి తద్దినంలా వస్తున్నాడంతే’’ సత్య సత్యవాక్కు. ‘‘నిజం రా. నాకు మంచి ఉద్యోగం వచ్చి ఉంటే, మా బావ ఛాయలక్కూడా వచ్చేవాణ్ని కాదు’’ అమర్.అర్ధరాత్రి దాటింది.‘‘అరే అమర్, కారాపు రా’’ అరిచాడు రాకేశ్.అమర్ కారు పక్కకు ఆపి, ‘‘ఏమైంది రాకేశ్’’ అన్నాడు.బ్యాక్సీట్లో కూచున్న రాకేశ్ ముందుకొచ్చి ‘‘అరే, నువ్వు దిగరా. ఇంకా నందికొట్కూరు కూడా రాలేదు. ఇట్టా స్లోగా నడిపితే తెల్లారిపోద్దిగానీ విజయవాడ మాత్రం రాదు’’ అంటూ బలవంతంగా అమర్‌ను దించి, తను డ్రైవింగ్ సీటులో కూచున్నాడు. బ్యాక్ సీటులోకి మారాడు అమర్.కారు వేగంగా ముందుకు కదిలింది.సత్య, శ్రీను మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. రెండు గంటల క్రితం జరిగిన సంఘటన అమర్ కళ్ల మీద ముళ్లు గుచ్చుతోంది.గొడవంతా ఆరెకరాల గురించి. నిజానికా భూమికి యజమాని రాజ్‌కుమార్. ఎనిమిదేళ్లపాటు బ్యాంకు ఉద్యోగిగా కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు, ఊళ్లో తన భాగంలో వచ్చిన రెండెకరాలు అమ్మి, ఏడేళ్ల క్రితం మంగళగిరికి దగ్గర్లో ఆరెకరాల భూమి కొన్నాడు. అప్పట్లో అతను గుంటూరులో పని చేసేవాడు. ఆ పొలం కొన్న సంవత్సరానికే అతనికి మేనేజరుగా ప్రమోషన్ వచ్చింది.బదిలీపై కర్నూలు వెళ్తూ ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. రాజకీయ బాల్యదశ దాటి యవ్వనంలోకి అడుగిడుతున్న ఓ స్థానిక నాయకుడు ఎకరం పన్నెండు లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నాడు. అయిదు లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి, అగ్రిమెంటు మీద సంతకాలు చేసుకున్నారు. ఆ తర్వాత రాజ్‌కుమార్ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ‘‘ఇదిగో అదిగో’’ అనేవాడు తప్ప రిజిస్ట్రేషన్ మాట ఎత్తేవాడు కాదు. అదేమంటే ‘‘అదో పనికిమాలిన భూమి. తెలియక కొన్నా’’నంటూ ఇంకేవో కబుర్లు చెప్పేవాడు.ఓరోజు రాజ్‌కుమార్ ఫోన్‌చేసి ‘‘సార్, మూణ్నెల్లలో రిజిస్ట్రేషన్ అని అగ్రిమెంటు రాసుకున్నాం. రెండేళ్లు గడిచాయి. ఇక మీకు దీనిమీద ఎలాంటి హక్కూ లేదు’’ అని సూటిగా చెప్పేశాడు.‘‘అయితే, నా అడ్వాన్స్ తిరిగిచ్చెయ్’’ అన్నాడా నాయకుడు. ‘‘అదెలా సార్! లీగల్‌గానూ మీకు రైట్ లేదు’’ గట్టిగానే చెప్పాడు రాజ్‌కుమార్.‘‘అరే పోరా నాయనా. అయిదు లక్షల్తో పోతది, లేకుంటే డెబ్భై కట్టాల’’ అంటూ ఫోన్ పెట్టేశాడు.రాష్ట్రం విడిపోయి అమరావతి రాజధాని అయ్యాక, ఆ భూమి బంగారుగని అయ్యింది. నాయకుడికి అనేక రాత్రులు నిద్ర కరవైంది. అప్పుడెప్పుడో రాసుకున్న అగ్రిమెంటు కాపీని వెయ్యిన్నొక్కసార్లు చూసుకున్నాడు. చివరికి తనకు రాజకీయ గురువైన మంత్రిగారిని శరణు కోరాడు. ఆయన అభయమిచ్చాడు.కర్నూలు నుంచి రాజ్‌కుమార్‌ను నాలుగుసార్లు పిలిపించి, మంత్రిగారు రాయ‘బేరాలు’ సాగించాడు.రాజ్‌కుమార్ అత్యంత వినయపూర్వకంగా ‘‘సార్, నేనాయన్ని బతిమాలాను. ఇప్పుడు దాని విలువ విపరీతంగా పెరిగింది. నా పిల్లలకూ అదే భరోసా. ఎలా వదులుకోగలను?’’ అని ఎదురు ప్రశ్నించాడు.‘‘పోనీ! పన్నెండు కాదుగానీ, ఎకరానికి పాతిక లక్షల చొప్పున ఇప్పిస్తా’’ మంత్రి ఆశజూపాడు.‘‘అన్యాయం సార్. రెండు కోట్లు విలువచేసే భూమికి పాతిక లక్షలా?’’‘‘పోనీ... నలభై? యాభై? ఆఖరికి అరవై?’’ మంత్రిగారి దయాపూరిత వేలంపాట!‘‘ఏందన్నా, ఈణ్ని బతిమాలేది..’’ అంటూ నాయకమ్మన్యుడు ఆవేశపడిపోయాడు. మంత్రి వారించాడు. ‘‘క్షమించండి సార్’’ అంటూ రాజ్‌కుమార్ మారు మాట్లాడకుండా నిష్క్రమించాడు.మరికొన్ని నెలలు ఆ విషయాన్ని వదిలేయమని శిష్యుడికి హితబోధ చేశాడు.ఆ తర్వాత ఓ కుట్రపూరిత ఉదయాన తన గణాన్ని సమావేశపరిచాడు. ఆయన చేతిలో ఏవో కాగితాలు.‘‘ఇవాళ్టి తేదీతో తయారు చేసిన అగ్రిమెంటు ఇది. ఈ స్టాంపు పేపర్ల మీద వాడు సంతకం చేస్తే చాలు. ఆ తర్వాత లీగల్‌గా మన బలంతో పొలం మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు!’’మంత్రిగారి గీతోపదేశం కల్గించిన ఉత్తేజంతో ఆ నలుగురూ సాయంత్రం ఆరింటికే కర్నూలు చేరుకున్నారు. రాజ్‌కుమార్ ఇల్లు ఎక్కడుంది, ద్వారాలు ఎటున్నాయి, అతను ఎన్ని గంటలకు ఇంటికొస్తాడు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు వంటి విషయాలపై రెక్కీ నిర్వహించారు.రాత్రి తొమ్మిదిన్నర దాటాక ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి, లోపల గడియ పెట్టారు.రాజ్‌కుమార్‌ను, భార్యాపిల్లల్ని ఇంటి వెనకవైపున్న ఖాళీస్థలంలోకి తీసుకెళ్లారు.సంతకం పెట్టమని సామదానభేద మార్గాల్లో ప్రయత్నించారు. రాజ్‌కుమార్ లొంగలేదు. పోలీసులకు సమాచారమివ్వబోతే... ఆయన చేతుల్లోంచి ఫోన్ లాక్కుని, నేలకేసి కొట్టారు.అయినా అతను దారికి రాలేదు. కావాలంటే, అడ్వాన్సుగా తీసుకున్న అయిదు లక్షలూ ఇచ్చేస్తానన్నాడు. వాళ్లు ఒప్పుకోలేదు.చివరికి అయిదో తరగతి చదువుతున్న అతని కొడుకును రాకేశ్ ఒకచేత్తో ఎత్తి పట్టుకుని, బావిలోకి విసిరేస్తానంటూ బెదిరించాడు. రాజ్‌కుమార్ చేతులు జోడించి లొంగిపోయాడు. అడిగిన చోటల్లా సంతకాలు పెట్టాడు. నలుగురూ విజయగర్వంతో బయటికి నడిచారు.రాత్రి పదకొండు గంటలవేళ... ఓ దాబాలో బిర్యానీ తిని, మద్యం తాగి, కారులో విజయవాడ బయల్దేరారు.కారు పాములపాడు దాటింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న తెలుగుగంగ కాల్వ మీద బ్రిడ్జి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ పెట్టిన డైవర్షన్ బోర్డును చివరి క్షణంలో అమర్ గమనించి, పెద్ద కేకతో రాకేశ్‌ను అప్రమత్తం చేశాడు. రాకేశ్ కారును ఎడమవైపుకు బదులు హఠాత్తుగా కుడివైపు తిప్పాడు. దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు కాలువకట్ట మీద రెండొందల మీటర్లకుపైగా దూసుకెళ్లి, అదుపు తప్పి, పెద్ద చెట్టుకు ఢీకొని అమాంతం కాల్వలోకి పడిపోయింది.దఢేల్మని పెద్ద చప్పుడు.‘‘రేయ్! ఉన్నారా... పలకండ్రా...’’ అమర్ అరుపులకు ప్రతిస్పందన లేదు.దాదాపు ముప్ఫై అడుగుల లోతులో లీలగా కారు ఆకారం కనబడుతోంది. మిత్రుల జాడ లేదు. ఫోను కోసం జేబు వెతుక్కున్నాడు. కనిపించలేదు. వెతికాడు. ఫలితం లేదు. చేతివాచిని కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూశాడు. రెండు గంటలు దాటింది.మెల్లగా ధైర్యం కూడగట్టుకుని రోడ్డు దాకా వచ్చాడు. పావుగంట వ్యవధిలో మూడు వాహనాలు వచ్చాయి. చెయ్యెత్తి ఆపడానికి ప్రయత్నించాడు. అవి కొద్దిగా స్లో అయి, వెంటనే పారిపోయాయి.మళ్లీ కారు పడిపోయిన ప్రదేశానికే వచ్చి, మిత్రుల్ని పేర్లు పెట్టి పిలిచాడు. అయిదారు సార్లు పిలిచాక, సన్నగా మూలుగులు వినిపించాయి. వాళ్లు బతికే ఉన్నారని నిర్ధారణ కాగానే కొంత ధైర్యం వచ్చింది. చుట్టూ చూశాడు. కుడివైపు కొద్ది దూరంలోని పొలంలో లాంతరు దీపం వెలుగుతోంది. ఓ మనిషి కనిపించాడు. గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. ‘‘ఎవురదీ?’’ తోటకు నీళ్లు పెడుతున్న ఆ రైతు ప్రశ్నించాడు.‘‘పెద్దాయనా, నా పేరు అమర్. ఫ్రెండ్స్‌తో కలిసి విజయవాడ వెళ్తున్నాం. కారు అదుపు తప్పి, కాల్వలో పడిపోయింది. నేను బయటపడ్డాను. ముగ్గురు ఫ్రెండ్స్ కాల్వలో పడిపోయారు. ప్లీజ్ కాస్త నాతో వస్తారా...’’‘‘ఒరొరే! సూద్దాం పా’’ మోటారు స్విచ్ ఆఫ్ చేసి, లాంతరు తీసుకుని బయల్దేరాడు.లాంతరు వెలుగులో ఆయన్ని పరిశీలనగా చూశాడు అమర్. డెబ్భై లోపు ఉండొచ్చు. పంచె కట్టి, చేతుల బనీను ధరించాడు. బక్కపలచగా ఉన్నప్పటికీ, సంపూర్ణ ఆరోగ్యవంతుడిలా కనిపించాడు. అలవాటయిన దారి కావడం వల్లనేమో, చకచకా నడుస్తున్నాడు.‘‘పెద్దాయనా, మీ పేరు?’’‘‘భానుముక్కల లింగన్న’’.‘‘ఈ టైములో...’’‘‘కరెంటు సమస్య. ఇప్పుడే వచ్చిన, తోటకు నీళ్లు పెట్టనీకి...’’ఇద్దరూ కట్ట మీదికి చేరుకున్నారు.‘‘ఇదిగో... ఇక్కడే కారు పడిపోయింది’’ చూపించాడు అమర్, కాలువలోకి తొంగిచూస్తూ.లింగన్న మోకాళ్ల మీద కూచొని, కాల్వలోకి ఒంగి, లాంతరునువీలైనంత కిందికి పెట్టి చూశాడు.మనుషులు కనిపించడం లేదుగానీ, మూలుగులు వినిపిస్తున్నాయి.కొద్దిగా ఆలోచించాడు లింగన్న. గబగబా పొలంలోకి వెళ్లి, పెద్ద మోకుతో తిరిగొచ్చాడు. దాన్ని కాలులోకి జారవిడిచాడు. ‘‘రేయ్ రాకేశ్... సత్యా... శీనూ... తాడును పట్టుకోండి రా...’’ పెద్దగా అరుస్తున్నాడు అమర్.చీకటి కారణంగా వాళ్లు మోకును పట్టుకున్నారో లేదో తెలియడం లేదు. లింగన్న నిమిషానికోసారి పైకి లాగి చూస్తున్నాడు, అది బరువుగా తగుల్తుందేమోనని. అమర్ అరుస్తూనే ఉన్నాడు.పావుగంట తర్వాత మోకు బరువుగా తగిలింది.‘‘బాబూ... రా రా... పట్టుకున్నాడు పట్టుకున్నాడు...’’ లింగన్న ఆదుర్దాగా అన్నాడు. అమర్ పరుగున వచ్చి, తను కూడా మోకు పట్టుకుని, ‘‘రేయ్... మేం మోకును పట్టుకున్నాం. మెల్లగా ఎక్కు... ఎక్కు...’’ అని అరుస్తూనే ఉన్నాడు.కాలువలోంచి ఓ మనిషి మెల్లగా పైకి పాకుతున్నాడు. మోకు క్రమంగా బరువెక్కుతోంది. కట్ట మీది దుమ్మునేల కారణంగా లింగన్న, అమర్ల కాళ్లకు పట్టు చిక్కడం లేదు. అతగాడు అయిదారు అడుగుల ఎత్తుకు వచ్చాడో లేడో... ఇద్దరి చేతుల్లోంచి మోకు జర్రున జారిపోయింది. అదిగానీ వదిలెయ్యకపోతే, ఇద్దరూ కాలువలోకి పడిపోయేవాళ్లు.‘‘రేయ్... ఆ మోకును పైకెయ్. ఈసారి గట్టిగా పట్టుకుంటాం...’’ పెద్ద గొంతుతో చెప్పాడు అమర్.కాలువలోంచి స్పందన లేదు. లింగన్న కాసేపు చూసి ‘‘ముప్ఫై అడుగుల పైనే లోతుంటది. ఎట్టా ఇనబడుద్ది! అది రాదులే. ఇంకోటి తెస్తా’’నంటూ పొలంలోకి వెళ్లి, మరో మోకుతో వచ్చాడు. ఈసారి మోకును కాల్వ పక్కనే పొలంలో ఉన్న జమ్మిచెట్టు మొదలుకు కట్టి, మరోవైపు కాల్వలోకి వదిలాడు.‘‘రేయ్... ఈసారి చెట్టుకు కట్టాం. ఎక్కరా... ఎక్కు...’’ ఆత్రంగా అరిచాడు అమర్.పది నిమిషాల తర్వాత మళ్లీ అతగాడు పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. శక్తినంతా కూడదీసుకుని... మోకును గుప్పిళ్లతో మింగేస్తూ... ఒక్కో అడుగూ పైకి చేరుకుంటూ...‘‘కమాన్... వచ్చేశావ్... ఇంకొంచెం... ఇంకొంచెం...’’ ఉత్సాహపరుస్తూ అరుస్తున్నాడు అమర్.అతికష్టం మీద ఎట్టకేలకు ఒడ్డుకు దగ్గరయ్యాడు.లింగన్న, అమర్ కట్ట మీద బోర్లా పడుకుని, చేతుల్ని కాల్వలోకి బారజాపి అతన్ని అందుకున్నారు. అమర్ పట్టు బిగించేలోపే... లింగన్న ఒక్క ఊపుతో అతగాణ్ని పైకి లాగేశాడు.అమర్ గబగబా పైకిలేచి, కట్టమీద వెల్లకిలా పడుకుని ఉన్న మిత్రుడి దగ్గరకు చేరుకున్నాడు.‘‘రేయ్ సత్యా... లేరా... లే...’’ అయిదు నిమిషాల తర్వాత సత్య లేచి కూచున్నాడు. బట్టలు తడిసిపోయాయి. నుదుటి మీద గాయం నుంచి రక్తం కారుతోంది.లింగన్న పొలంలోకి వెళ్లి మంచినీళ్ల సీసా తీసుకొచ్చి, సత్య నోటికందించాడు.‘‘బాబూ... ఆళ్లిద్దరూ ఎట్లా ఉన్నరు?’’ ఆరా తీశాడు లింగన్న.మంచినీళ్లు తాగి, తల గట్టిగా విదిలించాడు సత్య.‘‘మొత్తానికి ప్రాణాలతో ఉన్నారు. ఒకడు బురదలో కూరుకుపోయాడు. ఇంకోడు కారులోనే ఇరుక్కుపోయాడు. వాడు మాట్లాడుతున్నాడుగానీ ఏమంటున్నాడో అర్థం కావడం లేదు...’’‘‘పెద్దాయనా... ఎలాగైనా మీరే కాపాడాలి. ప్లీజ్...’’ అమర్ చేతులు జోడించి, లింగన్నను వేడుకున్నాడు.‘‘సూద్దాం. కానీ, వాళ్లు మోకు పట్టుకునే పరిస్థితిలో లేరు. ఎట్టాగ...’’ కాసేపు ఆలోచించి, ‘‘మనిద్దరం కిందకి దిగుదాం. వస్తావా?’’ అన్నాడు అమర్‌తో.‘‘వస్తా పెద్దాయనా’’.అమర్ వాచీవంక చూశాడు. నాలుగు కావస్తోంది. వెన్నెల సాంద్రత పెరిగింది.మోకు సాయంతో లింగన్న కిందికి దిగగానే, అమర్ అనుసరించాడు.ఇద్దరూ కారు బాయ్నెట్ మీంచి మెల్లగా అవతలికి చేరుకున్నారు. కారుకు పక్కనే బురదలో బోర్లా పడి ఉన్న మనిషిని వెల్లకిలా తిప్పారు. మొహం మీది బురదను హడావుడిగా చేతుల్తో తుడిచాడు అమర్.శీను! అతన్ని పట్టి కుదిపాడు లింగన్న. స్పృహలో లేడు. ప్రాణం ఉంది.అమర్ బుర్ర పని చేయడం మానేసింది.‘శ్రీనును పైకి చేర్చడం ఎలా?’ లింగన్నే ఆలోచిస్తున్నాడు.‘‘నేను పట్ట తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు’’ లింగన్న మోకు సాయంతో చకచకా పైకెక్కి, పొలంలోకి వెళ్లి, పరదాపట్ట తెచ్చాడు. దాన్ని కారు బాయ్నెట్ మీద పరిచి, శ్రీనును దాని మీద పడుకోబెట్టారు. మబ్బులు తొలగిపోయి, వెన్నెల నేలను ముద్దాడుతోంది.‘‘బాబూ, నువ్వు పైకెళ్లి రెండో మోకు కూడా కిందికెయ్’’ అమర్‌కు సూచించాడు.అమర్ పైకిళ్లి, అలాగే చేశాడు.లింగన్న ఆ చివర, ఈ చివర పట్ట చెంగుల్ని మోకులతో కట్టి, ఓ మోకు సాయంతో పైకి చేరుకున్నాడు.లింగన్న ఓ మోకును అమర్, సత్య మరో మోకును పట్టుకుని పైకి లాగడం మొదలు పెట్టారు. అలా లాగడం ఎంత కష్టమో తెలిసొచ్చింది అమర్‌కు. ఆఫ్టరాల్ ఒక్క మనిషి ఇంత బరువుంటాడా అనుకున్నాడు.పది నిమిషాల ప్రయాస అనంతరం శ్రీను శరీరాన్ని ఒడ్డుకు చేర్చారు. సత్య గబగబా దగ్గరగా వచ్చి, ‘‘రేయ్ శీను... శీనూ...’’ అంటూ ఏడుపు గొంతుతో అరిచాడు.‘‘పెద్దాయనా... వీడి ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. పాపం రాకేశ్ గాడు కారులో ఇరుక్కుపోయాడు. ఆణ్ని కూడా బతికించరూ. ప్లీజ్...’’ చేతులు జోడించాడు అమర్.‘‘అరె, అంత హైరానా పడతావేంది బాబూ. దా... మళ్లా దిగుదాం...’’ అంటూ శ్రీను బాధ్యతను సత్యకు అప్పగించి, ఇద్దరూ కాలువలోకి దిగారు.సగం పగిలిన అద్దంలోంచి రాకేశ్ తల, చేతులు బయటికి వేలాడుతున్నాయి. మాట ముద్దగా వస్తోంది. ఏం చెబుతున్నాడో అర్థం కావడం లేదు. ఎంత లాగినా బయటికి తియ్యలేకపోయారు.లింగన్న గబగబా పైకెక్కి, పెద్ద రాయితో మళ్లీ కారు దగ్గరకొచ్చాడు. అద్దాలు పగలగొట్టి, డోర్‌ను ఒకవైపుకు అణగ్గొట్టి... మొత్తానికి మెల్లగా రాకేశ్‌ను బయటికి లాగారు.అతని శరీరం రక్తసిక్తమైంది. ఎక్కడ పట్టుకున్నా బాధతో విలవిల్లాడుతున్నాడు.అతన్ని కూడా బాయ్నెట్ మీద పరదాలో పడుకోబెట్టి, అంతకుముందులాగే రెండు మోకులతో పైకి లాగారు. రాకేశ్‌ను జాగ్రత్తగా కట్ట మీదకు చేర్చి, సపర్యలు చేశారు. ఉన్నట్టుండి పెద్దగా వెక్కిళ్లు పెడుతూ స్పృహలోకి వచ్చాడు రాకేశ్. మంచినీళ్లు తాగించారు. వెక్కిళ్లు ఇంకా ఎక్కువయ్యాయి.ముగ్గురు మిత్రులతోపాటు లింగన్నలోనూ భయం మొదలైంది. ఒక్క క్షణం ఆలోచించి, పక్కనున్న పొదలవైపు పరుగు తీశాడు.కొన్ని ఆకులు తుంచి, రెండు అరచేతుల మధ్య నలిపి, ఆ రసాన్ని రాకేశ్ నోట్లో పిండాడు.రెండు నిమిషాల్లో వెక్కిళ్లు ఆగిపోయాయి.‘‘బాబూ, నాతో రా’’ అంటూ అమర్‌ను మెయిన్ రోడ్డు దాకా తీసుకెళ్లాడు.‘‘ఎట్టనో మీ నేస్తుల్ని ఎర్రగూడూరు దాకా తోల్కపోతే, ఆడ నాటువైద్యుడు దొర్కుతాడు...’’ చెబుతూనే, కర్నూలు వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ ఆపడానికి ప్రయత్నించాడు. ఒక్కరూ ఆపలేదు. పది నిమిషాల తర్వాత ఎర్రగూడూరు వైపునుంచే ఓ ట్రాక్టరు వచ్చింది.‘‘ఆరే, నాయక్... నాయక్... ఆపరా...’’ లింగన్న వెంటబడటంతో ఆపాడు.నాయక్‌ను ఒప్పించి, రాకేశ్‌ను ట్రక్కులోకి చేర్చారు. సత్య, శ్రీను, అమర్ కూడా అందులో ఎక్కారు.‘‘నేను నా బండి మీద వస్తా, మీరు పోండి’’ అంటూ లింగన్న పొలం వైపు వెళ్లాడు.ట్రాక్టరు ఎర్రగూడూరులో వైద్యుడి ఇంటికి చేరుకునేసరికి, లింగన్న కూడా వచ్చాడు.అయిదు కావస్తోంది. చీకటి పల్చబడుతోంది. డెబ్భై ఏళ్ల వృద్ధుడు ముగ్గురు మిత్రులకూ వైద్యం చేశాడు. ముగ్గురి బట్టలూ నీటితోనూ రక్తంతోనూ తడిసిపోయి, శరీరాలకు అంటుకుపోయాయి. ప్రాథమిక చికిత్స తర్వాత రాకేశ్ కూడా కోలుకున్నాడు.అమర్ బయటకు నడిచి నాయక్ దగ్గర ఫోను తీసుకుని మంత్రికి ఫోన్ చేశాడు.నాలుగోసారి ఫోనెత్తి, ‘‘ఏంట్రా ఈ టైవ్‌ులో?’’ అన్నాడు విసుగ్గా.జరిగిందంతా వివరించాడు అమర్.‘‘అవునా! మీరక్కడ ఎక్కువ సేపు ఉండొద్దు. మీ వివరాలు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. ఆత్మకూరులో నా ఫ్రెండొకడున్నాడు. మీ దగ్గరకు కారొస్తుంది. వెంటనే విజయవాడ వచ్చెయ్యండి’’ ఆదేశించాడు మంత్రి.అరగంటలో కారొచ్చింది.వాళ్లు లింగన్నకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి, కారెక్కారు. ఆ నలుగురూ పశ్చాత్తాపంతో దహించుకుపోయేవారా?దౌర్జన్యకాండ గురించి తెలిసుంటే ఆ పెద్దాయన వాళ్లను రక్షించేవాడా?రాజ్‌కుమార్ సంతకం చేసిన అగ్రిమెంటుకు... అవేమీ తెలియవు.అగ్రిమెంటులోని కొన్ని కాగితాలు ఊడిపోయి, తెలుగుగంగ కాలువ బురదలో కూరుకుపోయాయి.మొదటి పేజీ మాత్రం కారుసీటులోనే మిగిలిపోయింది.ఆ పేజీలో రాజ్‌కుమార్ చిరునామా ప్రస్తావించిన చోట సన్నాఫ్ భానుముక్కల లింగన్న, ఎర్ర గూడూరు, కర్నూలు జిల్లా అని రాసి ఉంది. ఎమ్వీ రామిరెడ్డి -
స్వర్గానికి దారి.. దొరికినట్లే!
బ్రాండ్.. బాజా! - హెచ్డీ మద్యం ఇక అధికారికం - బలవంతంగా అంటగడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు - చక్రం తప్పిన నంద్యాల ఎంపీ - అధికార పార్టీ నేత కావడంతో చెల్లుబాటు - ఒక్కో షాపునకు 300-400 కేసుల సరఫరా - అమ్ముడుపోక దుకాణదారుల గగ్గోలు అధికార పార్టీ నేతలు ఏమి చేసినా చెల్లుబాటే. మద్యం మత్తు కుటుంబాలను కాటేస్తున్నా.. మహిళల జీవితాలు నాశనం అవుతున్నా.. వీరికి వ్యాపారమే ప్రధానం. ఎంతలా అంటే.. దుకాణాలకు బలవంతంగా సరుకు అంటగట్టేంత. అది కూడా.. ప్రభుత్వ శాఖను అడ్డం పెట్టుకొని మరీ బరి తెగించడం టీడీపీ నాయకులకే చెల్లుబాటు. స్వర్గానికి దారి పేరిట నరకం చూపుతున్న తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వర్గానికి ద్వారం(హెవెన్ డోర్–హెచ్డీ). నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి విడుదల చేసిన ఈ మద్యం బ్రాండ్ ఇప్పుడు జిల్లాలో దుమ్ము రేపుతోంది. ఒక్కో మద్యం షాపునకు కచ్చితంగా 300 కేసుల నుంచి 400 కేసుల వరకూ సరఫరా అవుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ సిబ్బంది మద్యం షాపులకు లక్ష్యాలు విధించి మరీ హెచ్డీ మద్యాన్ని కేసులకు కేసులు సరఫరా చేస్తున్నారు. కేవలం గత సెప్టెంబర్ నెలలోనే జిల్లాలోని మద్యం షాపులకు హెచ్డీ బ్రాండ్ మద్యం ఏరులై పారింది. తాజా పరిణామాలతో అధికారపార్టీలో చేరినందుకు ఆయనకు స్వర్గానికి దారి దొరికిందేమో కానీ.. మాకు మాత్రం నరకానికి దారి కనిపిస్తోందని మద్యంషాపుల యాజమాన్యాలు వాపోతున్నారు. కొనుగోలు చేసిన సరుకు అమ్ముడుపోక.. మిగిలిన సరుకు ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాము కొనుగోలు చేయమంటే.. ఏ బ్రాండ్ మద్యం ఇచ్చేది లేదని ఎక్సైజ్ సిబ్బంది బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా జిల్లాలోని మద్యం షాపులన్నీ ఇప్పుడు హెచ్డీ బ్రాండ్లతో నిండిపోయాయి. కొన్ని షాపుల్లో ఏకంగా 200 కేసుల వరకూ ఇప్పుడు హెచ్డీ స్టాక్ మూలుగుతోంది. కోట్ల మద్యం జిల్లాలో మొత్తం 203 మద్యం దుకాణాలు ఉండగా.. ఒక్కో మద్యం దుకాణానికి 200 నుంచి 400 కేసుల వరకూ హెచ్డీ మద్యాన్ని సరఫరా చేశారు. కర్నూలు నగరంలో ఒక్కో షాపునకు 400 కేసులు సరఫరా చేస్తుండగా.. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న షాపులకు 200–300 కేసులను అంటగడుతున్నారు. ఈ లెక్కన సగటున ఒక్కో షాపునకు 250 కేసుల మద్యాన్ని లెక్కించినా.. 203 షాపులకు 50,750 కేసుల మద్యం సరఫరా అయ్యిందన్నమాట. ఒక్కో కేసుకు రూ.2 వేల చొప్పున రూ.10 కోట్లకుపైగా హెచ్డీ మద్యం కేవలం అక్టోబర్ నెలలో మాత్రమే సరఫరా చేయడం గమనార్హం. అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో మద్యం షాపులన్నీ ఇప్పుడు స్వర్గ జపం చేస్తున్నాయి. ఎక్సైజ్ సిబ్బంది టార్గెట్ తమ మద్యాన్ని విక్రయించుకునేందుకు అధికార పార్టీ నేత దగ్గరిదారి ఎంచుకున్నారు. ప్రత్యేకంగా మార్కెట్ టీం ఎందుకులే అనుకున్నారో ఏమో నేరుగా ఎక్సైజ్ సిబ్బందికే లక్ష్యాలు విధించారు. ఒక్కో ఎక్సైజ్ సీఐ స్టేషన్ పరిధిలో ఒక్కో మద్యం షాపు కచ్చితంగా 300 నుంచి 400 కేసుల వరకూ కొనుగోలు చేసేలా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇప్పించారు. ఫలితంగా జిల్లాలోని అన్ని మద్యం షాపులు 300 నుంచి 400 కేసుల వరకూ హెచ్డీ మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక్కో కేసులో 12 మద్యం సీసాలు ఉంటారు. అది కూడా ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ కావడం గమనార్హం. ఈ విధంగా ఒక్కో కేసును రూ.2 వేలు చెల్లించి మరీ మద్యం షాపు యాజమాన్యాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక్కో కేసుకు రూ.2 వేల చొప్పున లెక్కిస్తే 300 కేసులకు రూ.6 లక్షలు, 400 కేసులైతే రూ.8 లక్షలు చెల్లించి మరీ కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం షాపుల యజమానులు వాపోతున్నారు. -
జన్మ సార్థకతతోనే స్వర్గ ప్రాప్తి
ఇస్లామిక్ సమ్మేళనంలో పండితులు ♦ రెండు లక్షల మంది హాజరు సాక్షి, హైదరాబాద్: దేవుడు (అల్లా) ఇచ్చిన వరం మానవ జన్మ అని, దాన్ని సార్థకం చేసుకోగలిగినప్పుడే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని ఇస్లాం స్కాలర్స్ చెప్పారు. తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో పహాడీషరీఫ్‌లో మూడు రోజుల ప్రపంచ స్థాయి ఇస్లామిక్ (ఇజ్తేమా) సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. తొలి రోజు భారీ స్థాయిలో దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. ఇందులో బెంగళూర్‌కు చెందిన ఇస్లాం పండితుడు మౌలానా ఖాసీం ఖురేషీ ప్రసంగిస్తూ... ‘మానవ జన్మ ఒక పరీక్ష లాంటిది. దానిని సార్థకం చేసుకోవాలి. మంచి లక్షణాలతో మనుగడ సాగించాలి. ఒక మంచి కుమారుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, సమాజంలో ఒక పౌరుడిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించినప్పుడే జన్మ సార్థకమవుతుంది. ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. రాబోయే బంగరు జీవితాన్ని మరిచి తాత్కాలిక ఉపశమనాల కోసం ప్రాకులాడవద్దు. మనిషిని మనిషిగా గుర్తించి మానవత్వాన్ని చాటాలి. క్రమశిక్షణతో వ్యక్తిగత జీవితం నీతి నిజాయితీగా కొనసాగించి నప్పుడే ప్రవక్త చూపిన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది’ అన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన స్కాలర్ మౌలానా షౌకత్ మాట్లాడుతూ... ‘మనిషికి బతికినంతవరకే విలువ. మరణాంతరం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. తోటివారికి హాని తలపెట్టవద్దు. శాంతిని ప్రబోధించాలి. మహ్మద్ ప్రవక్త చూపించిన సన్మార్గంలో నడిచినప్పుడే సంపూర్ణ అత్మ శుద్ధిగల మానవుడిగా మారతారు. ఆధ్యాత్మిక చింతన సన్మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది’ అన్నారు. కార్యక్రమంలో భాషా మొయినోద్దీన ఆష్రఫ్ అలీ ఇఖ్రమలీ, వసీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రెండు వేలకు పైగా పండితులు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మందికి పైగా ఇస్లాం పండితులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఆదివారం మరింతమంది ప్రముఖ పండితుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండో రోజూ భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉందని తబ్లిక్ జమాత్ కమిటీ పేర్కొంది. సమ్మేళానానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. సోమవారంతో సమ్మేళనం ముగుస్తుంది. -
ఆస్పత్రికి బదులు స్వర్గానికెళ్లడమే బెటర్!
న్యూయార్క్: చూడగానే ముద్దొచ్చే ముఖం. కళ్లలో అనిర్వచనీయ అద్భుత తేజస్సు. నిండా ఐదేళ్ల ప్రాయం. అప్పుడే నిండు నూరేళ్లకు దగ్గరయింది. రోజులు లెక్కపెడుతోంది. కృతిమ శ్వాసతో దీర్ఘశ్వాసను పీలుస్తోంది. శాశ్వతంగా ఆ శ్వాస ఎప్పుడు గాలిలో కలసిపోతోందో తెలియదు. ఆ పాప పేరు జూలియన్నా స్నో. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఆమె తల్లి మిషెల్లీ మూన్ (స్వయాన న్యూరాలోజిస్ట్) ఓ రోజు తన పాపతో తన ఇంట్లో జరిపిన సంభాషణ ఇలా ఉంది...... తల్లి:: జూలియన్నా, మళ్లీ నీకు జబ్బు చేస్తే..ఆస్పత్రికి వెళతావా, ఇంట్లోనే ఉండిపోతావా? కూతురు: ఆస్పత్రికి వెళ్లను. తల్లి: స్వర్గానికి (చావు) వెళ్లాల్సి వచ్చినా, ఆస్పత్రికి వెళ్లవా? కూతురు: అవును! తల్లి: నేను, మీ డాడీ నీతో కలసి స్వర్గానికి ఇప్పుడే రాలేమని నీకు తెలుసుకదా! అయినా ఒక్కదానివే వెళతావా? కూతురు:మీరేమి కంగారు పడకండి, ఆ దేవుడు నా బాగోగులు చేసుకుంటాడు. తల్లి: ఒకవేళ నీవు ఆస్పత్రికి వెళితే...అక్కడ నీవు కోలుకోవచ్చు. అప్పుడు ఇంటికొచ్చి మాతో ఎంతోసేపు గడపొచ్చు. మమ్మీ డాడీతో గడిపే సమయాన్ని ఆస్పత్రికి వెళ్లడం ద్వారా నీకు కలుగుతుందన్న విషయాన్ని ఇక్కడ నీకు చెప్పదలిచాను. అర్థమైందా ? కూతురు: అర్థమైంది. తల్లి: నేనేడిస్తే నీవు భరించలేవని నాకు తెలిసు జులియన్నా, నిన్నెంతో కోల్పాతానని నాకు తెలుసు. అందుకు ఎంతో విచారిస్తున్నా. కూతురు: అది సరే! ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు. ఆయన నా హృదయంలోనే ఉన్నాడు. ఈ సంభాషణల డాక్యుమెంట్‌ను తల్లి మిషెల్ మూన్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఐదేళ్ల ప్రాయంలో ఏ పాప కూడా స్వచ్ఛందంగా (కారుణ్య మరణం) చనిపోయే విషయంలో నిర్ణయం తీసుకోలేదని, 8 లేదా 9 ఏళ్లు వస్తేగానీ వారికి మానసిక పరిణతి రాదని సైకాలజిస్టులు వాదిస్తుండగా, ఐదేళ్ల ప్రాయంలో తన పరిస్థితి గురించి తాను అర్థం చేసుకొని నిర్ణయం తీసుకునే పరిణితి ఉంటుందని పిల్లల స్పెషలిస్టులు వాదిస్తున్నారు. జూలియన్నా ఎంతో తెలివైనదని, కారుణ్య మరణం విషయంలో నిర్ణయం తీసుకునే పరిణతి ఆ పాపకుందని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ డానీ హైసియా వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఓరేగాన్‌లోని ఓ సీఎంటీ ఆస్పత్రిలో జూలియన్నా చికిత్స పొందుతోంది. ఆ పాప పుట్టుకతోనే చార్కాట్-మ్యారీ-టూత్ డీసీజ్ (సీఎంటీ)అనే ప్రాణాంతక నరాల జబ్బుతో బాధపడుతోంది. కాళ్లతో మొదలైన ఈ నరాల జబ్బు చేతుల మీదుగా ఇప్పుడు శ్వాసను నియంత్రించే కండరాలకు సోకింది. అందువల్ల ఆ పాప శ్వాసను పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే కృత్రిమ శ్వాసను ఏర్పాటు చేశారు. ఆ కృత్రిమ శ్వాసను తీసేసిన మరు క్షణాన ఆమె ప్రాణం గాలిలో కలసిపోయే ప్రమాందం ఉంది. అమెరికా వైమానిక దళంలో పనిచేస్తూనే మిషెల్ మూన్, స్టీవ్ స్నో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్టీవ్ యుద్ధ విమానాల పెలైట్‌గా పనిచేస్తున్నప్పుడే ఆయన స్క్వాడ్రన్‌లో మూన్ న్యూరోసర్జన్‌గా పనిచేశారు. వారికి 2010, ఆగస్ట్ 25వ తేదీన జూలియన్నా పుట్టింది. ఏడాది గడిచినా నడక రాకపోవడంతో స్వయంగా న్యూరోసర్జన్ అయిన మూన్ స్పెషలిస్ట్‌కు చూపించింది. వంశపార్యంపరంగా వచ్చే సీఎంటీ జబ్బుగా వైద్యులు తేల్చారు. దాంతో మూన్ తన భర్త స్టీవ్‌పై పరీక్షలు జరిపింది. ఆయనలో ఈ వ్యాధి మూలాలు చాలా మైల్డ్ స్థాయిలో ఉన్నాయనే విషయం బయటపడింది. అయినా ఆయన ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు. తర్వాత తరంలోనే ఈ వ్యాధి ముదురుతుందని, అందుకనే జాలియన్నాకు ఇది తీవ్రంగా ఉందని, ఇప్పుడు ఆ పాప పరిస్థితి నిలకడగానే ఉందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. ఈ ప్రాణాంతక సీఎంటీ జబ్బును 130 సంవత్సరాల క్రితం ఫ్రెంచ్కు చెందిన చార్కాట్, బ్రిటన్‌కు చెందిన మ్యారీ అనే డాక్టర్లు కనిపెట్టారు. అందుకనే వారి పేరునే జబ్బుకు పెట్టారు. -
మోక్షమెప్పుడో..!
జమ్మలమడుగు: జిల్లా ప్రజలకు ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఓ కలగా మారుతోంది. ఈ రైలుకు మోక్షమెప్పుడు వస్తుందా అని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం 1996-97లో మంజూరైంది. 126 కిలోమీటర్ల పరిధిలో రూ.883 కోట్ల అంచనా వ్యయంతో మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 2012 వరకు రూ.558 కోట్లు ఖర్చు చేశారు. పెండింగ్‌లో 30 కిలోమీటర్ల లైను మిగిలి ఉంది. ఇరవై శాతం పనులు ఈ మార్గం కోసం చేపట్టాల్సి ఉంది. 2012-13లో రూ.63కోట్లు కేటాయించారు. 2013-14లో రూ.30కోట్లు కేటాయించారు. బనగానపల్లె వరకు రైలుపట్టాలు నిర్మితమయ్యాయి. నంద్యాల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నొస్సం వరకు పనులు జరుగుతున్నాయి. రైలు మార్గం మంజూరై 17 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తికాలేదు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే రూ.300 కోట్లు కావాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే కడప - కర్నూలు జిల్లాల మధ్య ప్యాసింజర్ రైలు నడవనుంది. 2012 మార్చి నాటికే పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా పనులు మాత్రం మందకొడిగా సాగుతూనే ఉన్నాయి. కనీసం ఎర్రగుంట్ల - బనగానపల్లె వరకు ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం ఉన్నా దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 1996-1997లో అప్పటి రైల్వే మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ హయాంలో రూ.167 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ అంచనా రూ.470 కోట్లకు చేరింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ. 40కోట్ల కేటాయింపులు జరిగాయి. జిల్లాలో యర్రగుంట్ల నుంచి కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం సమీపం వరకు లైన్ నిర్మాణం, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ పూర్తయ్యాయి. 50 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ రూపుదిద్దుకుంది. ఈ మార్గంలో యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉంటాయి. నొస్సం నుంచి నంద్యాల వరకు రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. క్రాసింగ్ వంతెనలు, స్టేషన్ల నిర్మాణంలో పురోగతి అటకెక్కింది. నొస్సం నుంచి బనగానపల్లె మండలంలోని పండ్లాపురం వరకు ఎర్త్ పనులు పూర్తికాలేదని సమాచారం. జుర్రేరు, పాలేరు, కుందూ నదులపై వంతెనలతో పాటు, 45 లెవల్ క్రాసింగ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలంటే రెండేళ్లు పడుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కోవెలకుంట్ల వరకు పూర్తి చేసిన 82 కిలోమీటర్ల రైల్వేలైనులో పలుమార్లు ట్రయల్న్ ్రవిజయవంతంగా నిర్వహించారు. దాల్మియా కోసం.. ఎర్రగుంట్ల - నంద్యాల మధ్య ప్యాసింజర్ రైలు వస్తుందని గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు ఆశపడ్డారు. అయితే ప్యాసింజర్ రైలు రాలేదు గాని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోసం రైల్వే అధికారులు గూడ్స్‌రైలు నడుపుకోవటానికి అనుమతులు ఇచ్చారు. దీంతో అప్పుడప్పుడు ఈప్రాంత వాసులకు గూడ్స్‌రైలు దర్శనమిస్తోంది. మరి ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తుందోననే ఆతృతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
బాలుడి బుర్రలో కత్తి
తొలగించిన కేజీహెచ్ వైద్యులు విశాఖపట్నం: తుపానులో నేలకొరిగిన చెట్టు కొమ్మలు కొడుతుండగా పిడి నుంచి వేరుపడిన కత్తి ప్రమాదవశాత్తూ ఓ బాలుడి తలలో గుచ్చుకుపోయింది. భీమిలి మండలం తిమ్మాపురం గ్రామంలో ఈనెల 16న జరిగిన సంఘటన వివరాలు....ఎన్.సురేష్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో నేలకొరిగిన చెట్టుకొమ్మలను కత్తితో తొలగిస్తుండగా కత్తి పిడి నుంచి వేరై సమీపంలో వున్న కుమారుడు ఈశ్వరరావు తలలో 5 సెం.మీ లోతున గుచ్చుకుంది. కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి బాలుడి తల నుంచి కత్తిని తొలగించారు. -
స్వర్గనరకాలు భూమి మీదే ఉన్నాయి!
పరమార్థం జీవితంలో సుఖం ఒక్కటే ఉండాలనుకునే వారికి అడుగడుగునా అసంతృప్తే మిగులుతుంది. అనుభవాలు నరక సదృశం అవుతాయి.జీవితంలో దొరికిన దానితో సంతృప్తి పడేవారికి, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలిగిన వారికి అనుక్షణం స్వర్గమే. మనలో చాలామంది స్వర్గనరకాలను నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయా? అనే ప్రశ్న కూడా ఒకోసారి మనకు కలుగుతుంది. అయితే పైలోకాల మాట ఎలా ఉన్నా ‘‘భూమి మీద నువ్వున్నది స్వర్గమా? నరకమా? అన్నది నీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఒకరికి మనశ్శాంతి లేదు. ఎవరో ఏదో అన్యాయం చేశారనో, మరేదో కారణం వల్లనో అతడి మనసు గాయపడింది. అలజడి, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, అసూయ, ద్వేషం, కోపం.. ఇలా ఎన్నో అతడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అతడి మనసు నరకప్రాయం అయిందని అర్థం. ఇక్కడ నమ్మకంతో పని లేదు. అతడికది స్వానుభవం. ఇంకొకరి మనస్సులో నిర్మల ప్రశాంతత, ప్రేమ, కరుణ.. ఇలాంటివి నెలకొని ఉన్నాయి. ఇక్కడా నమ్మకంతో పనిలేదు. ఒక అపురూమైన అనుభూతితో మనసు నిండి ఉంటుంది. అదే అతడికి స్వర్గం. అతడికది స్వానుభవం. ప్రతి అనుభూతినీ పరిపూర్ణ సంతోషభావంతో గ్రహించగలిగిన స్థితప్రజ్ఞుడు ఎంతటి దుఃఖ భాజనుడితోనైనా నిశ్శబ్దంగా సంభాషించగలుగుతాడు. అతడి దుఃఖంలో పాలుపంచుకుంటాడు. సుఖాల్ని అందరికీ పంచిపెడతాడు. అతడిని అతడి నరకంలోంచి లాగి, తన స్వర్గంలోకి వెంటపెట్టుకుని వెళతాడు. ఇది సుఖపడే కాలం, ఇది బాధపడాల్సిన సమయం అంటూ ఎవరికీ జీవితంలోనూ ఎక్కడా రాసిపెట్టి ఉండవు. అంతా వ్యక్తి వర్తమాన స్థితిపై ఆధారపడి ఉంటుంది. తాను పరిమళాల్ని వెదజల్లాలని ఏ పువ్వూ ప్రత్యేకంగా అనుకోదు. అందరిని తన సువాసనలతో సరిసమానంగా సంతోషపరచడం దానికది ప్రకృతి ధర్మం. అలాగే తనకు ఉన్నంతలో తోడి వారి అవసరాలు తీర్చడం ఒక నిర్మల నిస్వార్థ హృదయానికి జన్మతో వచ్చే త్యాగ గుణం. స్వార్థంతో, అహంకారంతో, అసూయతో తాను సుఖపడకుండా, ఇతరులనూ సంతోషపెట్టకుండా తన బతుకును దుఃఖభరితం చేసుకునే మనిషి జీవితం అతడికే కాకుండా అందరికీ దుర్భరమే. మనిషి మరణానంతరం స్వర్గ నరకాల్లో దేనికి ప్రస్థానం జరుపుతాడో అన్న మీమాంసతో వర్తమానాన్ని అశాంతి పాలు చేసుకోనవసరం లేదు. ఇక్కడే ఈ భూమి మీదే స్వర్గ నరకాలలో దేనిని ఎంపిక చేసుకోవాలన్నా ఆ భగవంతుడు మనిషికి సమానమైన అవకాశాలు అడుగడుగునా సమకూరుస్తూనే ఉంటాడు. దేనిలో ప్రవేశించటమా అన్నది మనిషి చేతుల్లోనే ఉంది. - శొంఠి. విశ్వనాథం -
నూరేళ్ల పంటక నారూ... నీరు
వివరం మూడుముళ్లతో, ఏడడుగులతో దాంపత్యబంధం ఏర్పడిపోతుంది. పెళ్లి సంబంధం అలాక్కాదు! వివరాల ముడులు వీడాలి. ఆరాల అడుగులు పడాలి.అన్నీ కుదిరేవరకూ వాళ్లూ, వీళ్లు వస్తూపోతుండాలి. కుదిరాక... వేదిక చూడాలి. వేడుక చేయాలి. విస్తళ్లు పరవాలి. అప్పుడే నూరేళ్ల పంటకు నారూనీరు పోసిన ట్లు! భార్యాభర్తల అనుబంధానికి అక్షింతలు పడ్డట్లు! పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని, పెళ్లంటే నూరేళ్ల పంట అని మొదట ఎవరు అన్నారో కానీ ఆ మాటలు అక్షరసత్యాలు. అలాగే ‘ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు’ అనే పెద్దల హెచ్చరికలూ మనకు ఉండనే ఉన్నాయి. ఇల్లు కట్టి పెట్టడానికి బిల్డర్లు అనే నిపుణులు రంగంలోకి వచ్చినట్లే పెళ్లి కుదిర్చి పెట్టడమూ చాలాకాలం కిందటే ప్రొఫెషన్ అయిపోయింది. అయితే పెళ్లి కుదర్చడం చిన్న సంగతేమీ కాదు. తిరుపతి వెంకన్న కూడా తన పెళ్లి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చింది. పురాణకాలం నుంచి బయటకు వస్తే పూర్వకాలంలో పెళ్లిళ్లు దాదాపుగా బంధువుల మధ్యవర్తిత్వంతోనే కుదిరేవి. ‘ఫలానా వాళ్ల అబ్బాయి చాలా మంచివాడు, విద్యావంతుడు, సమర్థుడు, గుణవంతుడు...’ అంటూ పెద్ద మనసుతో సుగుణాలను ఏకరువు పెట్టి ఆ శుభకార్యం కాస్తా జరిపించేసి తృప్తి పడేవాళ్లు. అలాగే ఒకమ్మాయిని ‘ఒద్దిక గల పిల్ల, పెద్దలంటే భయభక్తులున్న అమ్మాయి, వాళ్ల అమ్మగారు కూడా ఇంటికి ఎంతమంది వచ్చినా చిరునవ్వుతో ఆదరించి, వండివారుస్తుంది, ఆ ఇంటి పిల్లకు ఆ లక్షణాలు రాక మానుతాయా’ అంటూ సమాధానంతో కూడిన ప్రశ్నను సంధిస్తూ అమ్మాయి గుణగణాలను పొగిడేవాళ్లు. ఇక ఎనభైలలో అమ్మాయికి చదువు అదనపు ఆభరణంగా వచ్చి చేరింది. తొంభైలలో అది తప్పనిసరైంది, అలాగే అబ్బాయికి ఉద్యోగం కూడా. కొంచెం అటూ ఇటూగా పెళ్లిళ్ల పేరయ్యలు ఊపందుకున్న దశ కూడా ఇదే. వైటుకె అంటూ కంప్యూటర్‌తో పాటు మనమూ ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగుపెట్టిన తర్వాత పెళ్లిళ్లు కుదిర్చేవారూ ‘కంప్యూటీకరణ’ చెందారు. కంప్యూటరైజ్డ్ మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి, మాట్రిమోనియల్ వెబ్సైట్లు వచ్చాయి. ఒకేరకం ఆలోచనలు, అభిరుచులు కలిగిన వారిని ఒక వరుసలోకి తెచ్చే వెబ్సైట్లతోపాటు ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్క్ సైట్లు కూడా యువతీయువకులను దాంపత్యబంధంలో ఇమిడ్చే సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాయి. దాంతో పెళ్లి కుదరడం సులువవుతోంది. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. ఎంత తేలిగ్గా అయితే సంబంధాలు కుదురుతున్నాయో అంతే తేలిగ్గా అభిప్రాయభేదాలు వచ్చి దంపతులు విడిపోవడమూ జరుగుతోంది! వైవాహిక జీవితం తామనుకున్నట్లు లేదని నిరాశానిస్పృహలతో పుట్టింటికొచ్చే యువతుల సంఖ్య పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సమస్య విదేశీ సంబంధాల విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకీ లోపం ఎక్కడ? దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకోవడంలోనా? అపార్థం చేసుకోవడంవల్లనా? అని విశ్లేషిస్తే... అపార్థాలకైనా, అభిప్రాయ భేదాలకైనా చాలావరకు కారణం పెళ్లికి ముంద ర కుటుంబ వివరాలు, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచడమేనని తెలుస్తోంది. అబ్బాయిలు చెప్పే వివరాలను అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అపార్థాలు తలెత్తుతుంటాయని మ్యారేజ్ బ్యూరో నిర్వహకులు కోటిరెడ్డి అంటున్నారు. అందుకే పెళ్లి కుదుర్చుకునేటప్పుడు ఇరువైపులవారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని ఆయన చెబుతున్నారు. అవి ఏమిటో చూద్దాం. తల్లిదండ్రుల బాధ్యత విద్యార్హతల విషయంలో కొంతమంది చెప్పే చదువుకీ, ఉన్న వయసుకీ పొంతన ఉండదు. అలాగే ఐఐటీలో చదివాడంటారు, బిఐటిఎస్, ఎన్ఐటి, ఐఐటి, ఎమ్ఐటి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను తలపించేటట్లు అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిని అడ్డుగా పెట్టుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే సందర్భాలు కొన్ని ఉంటే, మ్యారేజ్ బ్యూరో ఉద్యోగులకు విద్యాసంస్థల తేడాలు తెలియక పొరపాటుగా వెల్లడించేవి కొన్ని ఉంటాయి. వాటిని స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అలాగే విదేశీ విద్యాసంస్థల వివరాలను కూడా క్షుణ్నంగా కనుక్కోవాలి. అనుమానాలకు తావివ్వకూడదు పెళ్లి సంబంధం విషయంలో ఇరువైపుల వాళ్లూ పారదర్శకంగా ఉండాలి. చదువు, ఉద్యోగం వంటి వివరాలను ఆధారాలతో సహా చూపించాలి. ఎదుటివారు ప్రూఫ్ చూపిస్తున్నారు అంటే మన నుంచి కూడా ప్రూఫులు కోరుకుంటున్నారని అర్థం. స్థోమతలను గుర్తెరగాలి గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు చాలావరకు బంధువుల్లో విదేశీ సంబంధం చేసుకున్న వారిని ఆదర్శంగా తీసుకుంటుంటారు! కూతురు టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి వాళ్లు విదేశీ కలలు కంటుంటారు. దాంతో అమ్మాయి కూడా ఆదే కలలో జీవించడం మొదలుపెడుతుంది. విదేశీ సంబంధం అంటే చాలామందికి... విమానం ఎక్కడం, కారులో తిరగడం, నయాగారా ఫాల్స్వంటి చోట్లకు పిక్నిక్లకు వెళ్లడం, షాపింగ్ చేయడమే గుర్తొస్తాయి. వాస్తవంలోకి చూస్తే విదేశాలకు వెళ్లిన అబ్బాయి... అక్కడ అవసరం కాబట్టి వెళ్లిన తర్వాత నెలల్లోనే కారు కొని ఉండొచ్చు. అధికారిక రికార్డుల కోసం నంబరు కనిపించేటట్లు కారు ముందు నిలబడి ఫొటో తీసుకుని ఉండొచ్చు. ఎప్పుడో ఒకసారి పిక్నిక్కి వెళ్లి సరదాగా ఫొటోలు తీసుకుని, ఆ ఫొటోలను అమ్మాయి అమ్మానాన్నలకు పంపించి ఉండొచ్చు. సహజంగానే అబ్బాయి అమ్మానాన్నలు పెళ్లి చూపుల కోసం వాటినే ఇస్తారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు... అమెరికా వెళ్తే రోజూ షికార్లకు వెళ్లవచ్చు, వారానికోసారి షాపింగ్ చేయవచ్చు... అంతే సహజంగా రంగుల కల కంటారు. విచారణా కష్టమే! విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయి గుణగణాలను విచారించడం అంత సులభం కాదు. అక్కడ ఎవరికీ ఎవరి గురించీ ఆలోచించే తీరిక, గమనించే సమయం ఉండవు. ‘మనకు తెలిసిన వాళ్లు అదే చోట ఉన్నారు కాబట్టి విచారించి చెప్తారు’ అనుకోవచ్చు. కానీ ఇది అన్నివేళలా సాధ్యం కాదు. స్వదేశీ సంబంధాల విషయంలో ఇది కొంత సులువవుతుంది. రాబడి లెక్కలు ఓ పజిల్! ఎన్ఆర్ఐ సంబంధాలలో తప్పటడుగు పడే మరో అంశం జీతం. ఆ టెర్మినాలజీ అందులో దిగిన వాళ్లకు తప్ప ఇతరులకు ఒక పట్టాన అర్థం కాదు. అబ్బాయి జీతం ఏడాదికి 120కె అంటారు. ‘కె’ అంటే వెయ్యికి సూచిక. అబ్బాయి ఉన్న దేశం అమెరికా అయితే డాలర్లుగా, బ్రిటన్ అయితే పౌండ్లుగా ఆయా దేశాల కరెన్సీని అన్వయించుకోవాలి. గంపగుత్తగా రాబడి చెప్తారు కానీ అందులో పన్నులు, ఇతర లోన్లు వంటి ఖర్చులను స్పష్టం చేయరు. ఇక్కడ అబ్బాయి వాళ్లు అబద్ధం చెప్పారని ఆరోపించడానికీ లేదు. ఎన్ఆర్ఐ సంబంధం కావాలనుకున్న అమ్మాయి తరఫు వాళ్లు తెలుసుకోవాల్సిన వివరాలివన్నీ. ఏ వీసా మీద వెళ్లారు? అబ్బాయి విదేశానికి ఏ రకమైన వీసా మీద వెళ్లాడో అడిగి తీరాల్సిందే. ఉదాహరణకు హెచ్ 1 నిబంధనలు, గ్రీన్‌కార్డు నిబంధనలు వేరుగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను తీసుకెళ్లగలడా లేదా అనేది నిర్ధారించుకోవాలి. అమ్మాయిలు గమనించాల్సిన అంశాలు విదేశీ సంబంధం అనగానే కలల్లో తేలిపోతూ ఓకే చెప్పేయకూడదు. మన చదువు అక్కడ జీవించడానికి, ఉద్యోగం చేయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. (ఇక్కడ ఎంబిబిఎస్ చదివి అక్కడ గృహిణిగా మిగిలి పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. అక్కడ తదుపరి పరీక్షలు రాయక, రాసినా క్వాలిఫై కాకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యేవారూ ఉంటారు. కొంతమందైతే ‘ఏదో ఒక ఉద్యోగం లే’ అని ప్రొఫెషన్ చేరిపోతుంటారు). రెండో పెళ్లి సంబంధాలలో... యుఎస్ డైవోర్స్‌ని మన న్యాయవ్యవస్థ ఒప్పుకోదు. కనుక ఆ వివరాలు తెలుసుకోవాలి. యుఎస్‌లో భార్యకు భరణం ఎక్కువగా ఇప్పిస్తారు. జీతంలో ఈ కటింగులు ఉంటాయి. అందుకే జీతంతోపాటు భరణం వివరాలూ తెలుసుకోవాలి. కొంతమందికి రెండు- మూడు డైవోర్స్లు ఉంటాయి. కానీ వివరాలలో ఒక డైవోర్స్నే చూపిస్తారు. కనుక ఎంతమందికి భరణం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు, పిల్లలున్నారా లేదా? ఈ వివరాల కోసం అడగాలి. విడాకుల జడ్జిమెంట్ కాపీ చూపించమని అడగడంలో కూడా తప్పేం లేదు. అబ్బాయిలు గుర్తుంచుకోవాల్సినవి! అబ్బాయిలు పెళ్లి సంబంధాలు చూడడంలో పరిమితి పాటించాలి. పెళ్లి సంబంధాల పేరుతో అమ్మాయిల ఫొటోలు చూస్తూ, ఆ తర్వాత పెళ్లిచూపులు చూస్తూ పోవడం మంచిది కాదు. (ఉదాహరణకు యుఎస్‌లో ఉన్న ఒక డాక్టరు మెడిసిన్ చదివిన అమ్మాయిలను చూసి చూసి చివరికి ఒకరిని పెళ్లి చేసుకుని కాపురం పెడతాడు. యుఎస్‌లో చాలావరకు షేరింగ్ ఇళ్లు తీసుకుంటారు. ఇలా డాక్టర్లందరూ ఒకేచోటికి చేరుతారు. ఒకబ్బాయికి తాను చూసిన వారిలో కనీసం నలుగురు- ఐదుగురు అమ్మాయిలు అక్కడ తారసపడుతుంటారు. కొందరిని పెళ్లి చూపుల్లో చూసి మానుకున్న వాళ్లు, పెళ్లి చేసుకోదలుచుకున్న తర్వాత నాలుగైదు నెలలు ఫోన్లో మాట్లాడుకుని ఏదో కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిన వాళ్లు కూడా ఉండవచ్చు. ఈ పరిస్థితి అమ్మాయిలకు ఇబ్బందికరం). అలాగే అత్తమామలతో కలిసి ఉండాలన్న విషయాన్ని అమ్మాయికి ముందే చెప్పాలి. అందుకు ఇష్టపడిన అమ్మాయినే పెళ్లిచేసుకుంటే మంచిది. అబ్బాయి... అమ్మాయి...! అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఎవరికి వారు ఎదుటివారికి తమ సర్టిఫికేట్స్ చూపించాలి. అన్నీ పట్టిపట్టి చూస్తున్నారని నిష్టూరపడకూడదు, తప్పు పట్టకూడదు. ఒకవేళ రెండు డేటాఫ్ బర్త్‌లు ఉంటే వాటినీ సరిచూసుకోవాలి. చిన్నపాటివే కదా అని కొన్ని వివరాలను తేలిగ్గా తీసుకుంటారు. అలాంటి చిన్న విషయాలలో ఉండే తేడాలే అపోహలకు కారణం అవుతుంటాయి. ఎత్తు, బరువుతో సహా ప్రతిదీ కచ్చితమైన వివరాలనే ఇవ్వాలి. - వాకా మంజులారెడ్డి -
వివాహం విషయంలో మూడు ప్రాంతాలవారికి పట్టింపులు