సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.
అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
ఫోన్ ట్యాంపింగ్‌పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment