
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా చట్టపరమైన చర్యలుంటాయని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం(జులై 30) ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులున్నా ఎవరున్నా వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు.
మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్న ఆ ఇద్దర్ని రప్పించడానికి చట్టపరంగా ప్రాసెస్ జరుగుతోంది. కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్షాధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేశాం. దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు అంగీకరించింది. త్వరలో బలమైన సాక్షాలను సేకరించి అనుమానితులను విచారిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఒక టీం పని చేస్తోంది.