
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఓనర్‌ను త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది.
కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో సోదాలు చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు 5 మాక్ మినీ డివైజ్‌లు సిట్ సీజ్ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించినట్లు సిట్ వెల్లడించింది..

.. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment