TG: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం | Advocate Suresh Complained To ED On Phone Tapping Case - Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఈడీకి ఫిర్యాదు

Published Wed, Apr 10 2024 5:04 PM | Last Updated on Wed, Apr 10 2024 5:16 PM

Aadvocate Suresh Complaint To Ed On Phone Tapping Case - Sakshi

సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్‌ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్‌ చేసి వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును  పోలీసు వాహనాల్లో  ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. 

కాగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్‌ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు  ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసి ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 

ఇదీ చదవండి.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాం‍డ్‌ పొడిగింపు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement