కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ రాముడు భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ రాముడు భేటీ అయ్యారు. వారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు అధికారాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ప్రధాన మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వరుసగా భేటీ కానున్నారు.