'గోపాల గోపాల'పై మంత్రికి ఫిర్యాదు | advocates complaint against gopala gopala movie | Sakshi
Sakshi News home page

'గోపాల గోపాల'పై మంత్రికి ఫిర్యాదు

Published Fri, Jan 16 2015 1:10 PM | Last Updated on Wed, May 29 2019 3:25 PM

'గోపాల గోపాల'పై మంత్రికి ఫిర్యాదు - Sakshi

'గోపాల గోపాల'పై మంత్రికి ఫిర్యాదు

హైదరాబాద్ : హైకోర్టు విభజనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని  తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని, వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

తెలంగాణ న్యాయవాదుల సంఘం కొత్త సంవత్సర క్యాలెండర్‌ను సచివాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.  'గోపాల గోపాల' సినిమాలో తమకు కించపరిచే సన్నివేశాలున్నాయని ఈ సందర్భంగా న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement