ఏ ఒక్కరినీ వదల్లేదు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన వాంగ్మూలం Work For BRS Bhujanga Rao Sensational Confession In Phone Tapping Case | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ కోసం ఏ ఒక్కరినీ వదల్లేదు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన వాంగ్మూలం

Published Tue, May 28 2024 12:52 PM | Last Updated on Tue, May 28 2024 12:53 PM

Work For BRS Bhujanga Rao Sensational Confession In Phone Tapping Case

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం.. సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతిపక్షం, పాలక పక్షం అని చూడకుండా.. నాటి అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేసిన ప్రతీ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం. గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు.. ప్రణీత్‌రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తేలింది.

భుజంగరావు వాంగ్మూలంలోని విషయాలు యథాతథంగా..  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికసాయం అందించే వారి ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ ట్యాపింగ్ చేసి SOT, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లాం. ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం. 

.. జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూడు ఉపఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ కుమార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం. మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్‌తో ఆపరేషన్ చేశాం. అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం. 

.. సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించాం. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యా శ్రీధర్‌రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినక పోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం. 

.. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్‌పై విమర్శలుచేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం అని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement