సాక్షి, అమరావతి: తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోన్‌ను ట్యాప్ చేయించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకు తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు. ఏవైనా ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాల్సి ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేసిన సజ్జల.. టీడీపీ హయాంలో జరిగిన తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పత్రాలను షేర్ చేశారు. (చంద్రబాబు తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం)
మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్సీపీ నాయకుడిగా ఉన్న నాఫోన్‌ను చంద్రబాబుగారు @ncbn ట్యాపింగ్ చేయించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇది. దీన్ని న్యాయస్థానాలకూ సమర్పించాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్న బాబుగారు ఇలా ఆధారాలు ఎందుకు చూపడంలేదు? pic.twitter.com/jthxGycxOf
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) August 19, 2020
Comments
Please login to add a commentAdd a comment