మూవీ బజ్: సల్మాన్ ఔదార్యం | Salman Khan to help 100 kids with heart disease | Sakshi
Sakshi News home page

మూవీ బజ్: సల్మాన్ ఔదార్యం

Published Thu, Jul 31 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

మూవీ బజ్: సల్మాన్ ఔదార్యం

మూవీ బజ్: సల్మాన్ ఔదార్యం

ఈసారి ఈద్-ఉల్-ఫితర్ పండుగ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు వంద కోట్ల ‘కిక్’ ఇచ్చింది. అయితే, ‘కిక్’ తలకెక్కించుకోకుండా అతడు హృద్రోగులపై ఔదార్యాన్ని చాటుకోవడం విశేషం. తన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’ ద్వారా గుండె జబ్బులతో బాధపడే వందమంది చిన్నారులకు ఉచితంగా చికిత్స కల్పించనున్నట్లు ఈద్ సందర్భంగా ప్రకటించాడు.
 
 శ్రద్ధాకు గాయం
వరుణ్ ధావన్ హీరోగా రెమో డిసౌజా రూపొందిస్తున్న ‘ఏబీసీడీ 2’ చిత్రం రిహార్సల్స్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడింది. నాట్య ప్రధానమైన ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం రిహార్సల్స్ చేస్తుండగా, అనుకోకుండా ఆమెకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు వారం రోజులు విశ్రాంతి తీసుకుంటూ, ఫిజయోథెరపీ చేయించుకుంటోంది.    
 
 వివేక్ పునరాగమనం
 యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిస్తున్న ‘బ్యాంక్ చోర్’లో వివేక్ ఓబెరాయ్ సీబీఐ పాత్ర పోషిస్తున్నాడు. ‘సాథియా’ విడుదలైన పన్నెండేళ్ల విరామం తర్వాత వివేక్ తిరిగి యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ సినిమాలో నటిస్తుండటం విశేషం. వివేక్ పునరాగమనం పట్ల యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement