Salman Khan Hints that Varun Dhawan is Going to Be Father - Sakshi
Sakshi News home page

Varun Dhawan: త్వరలో తండ్రి కాబోతున్న యంగ్‌ హీరో, హింటిచ్చిన సల్మాన్‌

Published Sun, Nov 13 2022 9:06 PM | Last Updated on Sun, Nov 13 2022 9:29 PM

Salman Khan Hints that Varun Dhawan is Going to Be Father - Sakshi

ఇటీవలే రణ్‌బీర్‌- ఆలియా, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌- బిపాసా బసు దంపతులు తమ ఇంట్లో చిన్ని పాపాయికి స్వాగతం పలుకుతూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే! తాజాగా మరో హీరో కూడా త్వరలో తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. భేదియా సినిమా ప్రమోషన్స్‌ కోసం హీరోయిన్‌ కృతీ సనన్‌ను వెంటపెట్టుకుని బిగ్‌బాస్‌ 16 సీజన్‌కు వెళ్లాడు హీరో వరుణ్‌ ధావన్‌. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లతో సరదా గేమ్స్‌ ఆడించాడు సల్లూ భాయ్‌. ఈ క్రమంలో ఓ బొమ్మను వరుణ్‌ చేతిలో పెట్టి ఇది నీ పిల్లాడి కోసమేనని చెప్పాడు. దీంతో సిగ్గుపడిపోయిన యంగ్‌ హీరో.. కానీ నాకింకా ఎవరూ పుట్టనే లేదు అని చెప్పాడు.

దీనికి సల్మాన్‌.. ఆ బొమ్మను నువ్వు ఇంటికి తీసుకెళ్లావంటే త్వరలోనే నీ ఇంట్లోకి నిజమైన బేబీ వస్తుంది అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు సల్మాన్‌ సరదాగా అలా మాట్లాడాడా? లేదంటే వరుణ్‌ దంపతులు నిజంగానే త్వరలో పేరెంట్స్‌ కాబోతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సల్మాన్‌ ఇటీవలే బిగ్‌బాస్‌ హౌస్‌లో థాంక్‌ గాడ్‌ ప్రమోషన్స్‌ కోసం వచ్చిన సిద్దార్థ్‌ను ఉద్దేశించి త్వరలో అతడి పెళ్లి జరగబోతుందని హింటిచ్చాడు. దీంతో వరుణ్‌ విషయంలో కూడా అది జోక్‌ కాదని, ఇది కూడా ఒక హింటే అంటున్నారు. కాగా వరుణ్‌, నటాషా 2021 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వరుణ్‌ నటించిన భేదియా నవంబర్‌ 25న విడుదల కానుంది.

చదవండి: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి దుర్మరణం
రెమ్యునరేషన్‌ ఇవ్వమంటే ముఖం చాటేశాడు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement