ఐటెం సాంగులకైనా నేను రెడీ | Ready to do item numbers, says Jacqueline Fernandes | Sakshi
Sakshi News home page

ఐటెం సాంగులకైనా నేను రెడీ

Published Sat, Jul 19 2014 4:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఐటెం సాంగులకైనా నేను రెడీ - Sakshi

ఐటెం సాంగులకైనా నేను రెడీ

బాలీవుడ్ సినిమాల్లో తాను ఐటెం సాంగులు చేయడానికి కూడా సిద్ధమేనని చెబుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ సినిమాలలో పాటలు, డాన్సులు చాలా ముఖ్యమైన భాగమని, అందుకే.. ఏదైనా సినిమాలో తనకు ఐటెం సాంగ్ వస్తే తప్పకుండా చేస్తానని ఈ శ్రీలంక చిన్నది చెప్పింది. ప్రస్తుతం కిక్ సినిమా ప్రమోషన్లో మహా బిజీగా ఉన్న జాక్వెలిన్.. ఎందుకోగానీ, కత్రినా కైఫ్ను పొగడ్తల్లో ముంచెత్తింది.

కత్రినా కైఫ్ భలే కష్టపడి పనిచేస్తుందని, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె బాలీవుడ్ను ఏలుతోందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెగ పొగిడేసింది. కిక్ సినిమాలో హీరో సల్మాన్ఖాన్కు మాజీ ప్రేయసి అయిన కత్రినాను పొగిడితే తనకు ఉపయోగం ఉంటుందని భావించిందో ఏమో గానీ.. ఈ పని మొదలుపెట్టింది. కష్టపడకుండా ఏమీ సాధించలేమని, కత్రినా ఇన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతుండటం వల్లే ఇన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement