కత్రినా కైఫ్
తాజా వార్త ఏంటంటే.. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు! చేరడం అంటే? బాలికల విద్యకు రాయబారిగా ఇకనుంచీ ఆమె ఆ సంస్థ తరఫున పనిచేస్తారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ గత పదేళ్లుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 12 వేల గ్రామాలలో 21 వేల పాఠశాలలతో కలిసి పనిచేస్తోంది. బడి మానేసిన బాలికల్ని మళ్లీ బడిలో చేర్పించేందుకు సఫీనా హుస్సేన్ అనే ఢిల్లీ సోషల్ వర్కర్ ఈ సంస్థను ప్రారంభించారు. స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యతలో లైంగిక వ్యత్యాసాన్ని తగ్గించి ఈక్వల్ ఈక్వల్ చెయ్యడం సఫీనా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఇప్పుడు ఆమె కత్రినా అనే బాణంతో ఛేదించి సాధించబోతున్నారు. ఇంతకీ కత్రినా ఏం చదివారు? ఏమీ చదవలేదు. జీవితాన్నయితే విస్తృతంగా చదివారు. కత్రినా కుటుంబం ఏ దశలోనూ ఒకేచోట స్థిరంగా ఉండిపోలేదు. అందుకే కత్రినాకు చదువుకునే అవకాశం రాలేదు. అందరూ అనుకుంటున్నట్లు కత్రినా లండన్ అమ్మాయి కాదు.
హాంకాంగ్‌లో పుట్టింది. అక్కడి నుంచి వాళ్ల ఫ్యామిలీ చైనా వెళ్లింది. చైనా నుంచి జపాన్ Ðð ళ్లింది. అక్కడి నుంచి పడవలో ఫ్రాన్స్ వెళ్లింది. అప్పటికి కత్రినాకు 8 ఏళ్లు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్, పోలండ్, జర్మనీ, బెల్జియం, ఇంకొన్ని ఐరోపా దేశాల్లో కొన్ని నెలలపాటు గడిపింది. తర్వాత హవాయికి. ఆ తర్వాత ఇంగ్లండ్‌కి. కత్రినా అమ్మగారి దేశం అది. అక్కడ కూడా మూడేళ్లు ఉంది కత్రినా. అక్కడి నుంచి ముంబై వచ్చేసింది. తండ్రిగారి పూర్వీకులు ఉన్నారిక్కడ. ముంబై వచ్చాక మోడలింగ్, బాలీవుడ్. ఇదీ కత్రినా జీవనయానం. ఎక్కడా స్టడీస్‌కి చోటే లేదు. అయినా ప్రపంచాన్ని మించిన పుస్తకం ఎక్కడ ఉంటుంది! అందుకే ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ రాయబారిగా కత్రినా చక్కగా సరిపోతారు. అయినా కత్రినా ఇన్ని దేశాలు ఎందుకు తిరగవలసి వచ్చింది? తండ్రి వ్యాపారి.
Comments
Please login to add a commentAdd a comment