Jacqueline Fernandes
-
కోర్టుకు బ్లాక్ డ్రెస్‌లో రావా బేబీ.. వెలుగులోకి సుఖేష్ మెసేజ్‌లు
ఢిల్లీ:రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాక్వెలిన్‌కు సుఖేష్ పంపించిన మెసేజ్‌లు కీలకంగా మారాయి. కోర్టులో విచారణ సందర్భంగా జాక్వెలిన్‌ను బ్లాక్ డ్రెస్‌లో కనిపించాలని జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. జాక్వెలిన్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. 2023 జూన్ 30న జాక్వెలిన్‌కు సుఖేష్ మెసేజ్ చేశాడు.'బేబీ వచ్చే 6వ తేదీ కోర్టులో విచారణ ఉంటుంది. హాజరైతే దయచేసి నల్ల కుర్తా ధరించు. తద్వారా నా మెసేజ్‌లన్నీ చూస్తున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటా. మిస్సింగ్ యూ.. ఐ లవ్ యూ బేబీ గర్ల్. నువ్వు ఎప్పటికీ నా దానివే' అని సుఖేష్ రాసుకొచ్చాడు. 'తాజా ట్రోల్‌లతో కలత చెందుతున్నావని నాకు తెలుసు. కానీ బాధపడకు. ఇవేవీ పెద్దవి కావు. నువ్వు నా యువరాణివి. సూపర్ స్టార్ అవుతావు.' అని పేర్కొన్న సుఖేష్.. జాక్వెలిన్ బ్లాక్ డ్రెస్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మెసేజ్ చేశాడు. 'బేబీ, కోర్టులో విచారణ సందర్భంగా బ్లాక్ డ్రెస్ ధరించకపోవడం చాలా బాధ కలిగించింది. ఏమి ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు. ఏ విధంగానైనా సహాయం చేస్తానంటే నీకు తోడుగా ఉంటా. నీకు అవసరాలను ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నా.' అని సుఖేష్ మెసేజ్ చేశాడు. అంతేకాకుండా దర్శకుడు, సంగీత రచయిత లవ్ రంజన్ ఒక సినిమా కోసం జాక్వెలిన్‌ను కలుస్తారని పేర్కొన్నాడు. కాగా.. ఈ కేసులో ఫెర్నాండెజ్ పాత్ర ఉందని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశాడు. దీంతో సుఖేష్‌పై ఫెర్నాండేజ్ తిరగబడ్డారు. సుఖేష్ బెదిరింపుల నుండి రక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సుకేష్ చంద్రశేఖర్ లక్షిత దాడిలో తాను అమాయకురాలినని, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి
ముంబై: తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫొటోలను బహిరంగపరచవద్దని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(36) మీడియాను కోరారు. సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడితో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆదివారం జాక్వెలిన్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. బహ్రెయిన్‌లో ఉన్న జాక్వెలిన్ తల్లి ఇటీవల గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. చంద్రశేఖర్ తదితరులకు సంబంధమున్న మనీ లాండరింగ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలుమార్లు జాక్వెలిన్ హాజరైన విషయం తెలిసిందే. -
డ్యాన్స్ అండ్ డ్యాన్స్!
ముంబై: ఐపీఎల్ అంటే క్రికెట్ వినోదానికి చిరునామా. అయితే ప్రతీ ఏటా మ్యాచ్‌లకు ముందు ఆరంభ వేడుకలు కూడా అంతే స్థాయిలో అభిమానులను అలరిస్తూ వచ్చాయి. ఈసారి కూడా లీగ్ ప్రారంభోత్సవం అదిరిపోతుందని బీసీసీఐ హామీ ఇస్తోంది. గతంతో పోలిస్తే ఒక రోజు ముందు కాకుండా తొలి మ్యాచ్ రోజే ప్రారంభోత్సవం జరుగుతుండటం ఒక్కటే మారింది. ఇది మినహా వినోదంలో ఏమాత్రం లోటు ఉండదనేది నిర్వాహకులు మాట. బాలీవుడ్లో అత్యుత్తమ డ్యాన్సింగ్ హీరోలుగా గుర్తింపు ఉన్న హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ తమ ప్రదర్శనతో అలరించేందుకు సిద్ధమయ్యారు. డ్యాన్స్‌కే అడుగులు నేర్పించగల ప్రభుదేవా కూడా వీరితో జత కలిస్తే ఇక ఫ్లోర్ అదిరిపోవడం ఖాయం! ఆటపాటల్లో గ్లామర్‌కు కూడా లోటు లేకుండా ఉండేందుకు మరో ఇద్దరు హీరోయిన్లతో స్పెషల్ షో ఈ వేడుకల్లో మరో ఆకర్షణ. సూపర్ హిట్ పాటలపై అదరగొట్టే స్టెప్పులు వేసేందుకు తమన్నా భాటియా, జాక్లిన్ ఫెర్నాండెజ్ రెడీ. పాపులర్ సింగర్ మికా సింగ్ కూడా తన గొంతు సవరించుకొని పంజాబీ–హిందీ పాటలతో అలరించనున్నాడు. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు టాస్ వేసే సమయం 7.30 వరకు కొనసాగుతాయి. -
సల్మాన్ వచ్చాడు.. షారుక్ రాలేదు!
సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధవన్.. వీళ్లంతా బాబా సిద్దిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో మెరుపులు మెరిపించారు. అయితే అందరి కళ్లూ కింగ్ ఖాన్ కోసం ఎదురు చూసినా.. ఆయన మాత్రం ఈ విందుకు హాజరు కాలేదు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా షారుక్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ పార్టీకి మాత్రం షారుక్ రాలేదు. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్ల పక్కనే కూర్చుని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా తన డిన్నర్ చేసింది. ఈ ఇఫ్తార్ విందులో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ కూడా పాల్గొన్నారు. హుమా ఖురేషి, కబీర్ ఖాన్, జరైన్ ఖాన్, సంగీతా బిజ్లానీ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు టీవీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చారు. బాబా సిద్దిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందులో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ గత రెండేళ్లుగా పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా.. దీనికి మాత్రం తప్పనిసరిగా హాజరయ్యేవాళ్లు. ఈసారి మాత్రం షారుక్ డుమ్మా కొట్టాడు. -
ఐటెం సాంగులకైనా నేను రెడీ
బాలీవుడ్ సినిమాల్లో తాను ఐటెం సాంగులు చేయడానికి కూడా సిద్ధమేనని చెబుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ సినిమాలలో పాటలు, డాన్సులు చాలా ముఖ్యమైన భాగమని, అందుకే.. ఏదైనా సినిమాలో తనకు ఐటెం సాంగ్ వస్తే తప్పకుండా చేస్తానని ఈ శ్రీలంక చిన్నది చెప్పింది. ప్రస్తుతం కిక్ సినిమా ప్రమోషన్లో మహా బిజీగా ఉన్న జాక్వెలిన్.. ఎందుకోగానీ, కత్రినా కైఫ్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. కత్రినా కైఫ్ భలే కష్టపడి పనిచేస్తుందని, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె బాలీవుడ్‌ను ఏలుతోందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెగ పొగిడేసింది. కిక్ సినిమాలో హీరో సల్మాన్‌ఖాన్‌కు మాజీ ప్రేయసి అయిన కత్రినాను పొగిడితే తనకు ఉపయోగం ఉంటుందని భావించిందో ఏమో గానీ.. ఈ పని మొదలుపెట్టింది. కష్టపడకుండా ఏమీ సాధించలేమని, కత్రినా ఇన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతుండటం వల్లే ఇన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపింది.