ముంబై: తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫొటోలను బహిరంగపరచవద్దని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(36) మీడియాను కోరారు. సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడితో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆదివారం జాక్వెలిన్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు.
కష్టకాలంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. బహ్రెయిన్‌లో ఉన్న జాక్వెలిన్ తల్లి ఇటీవల గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. చంద్రశేఖర్ తదితరులకు సంబంధమున్న మనీ లాండరింగ్ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలుమార్లు జాక్వెలిన్ హాజరైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment