'కిక్' ఇవ్వలేదు.. కోట్లు కొల్లగొడుతున్నాడు!
'కిక్' ఇవ్వలేదు..కోట్లు కొల్లగొడుతున్నాడు!
Published Tue, Aug 26 2014 3:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో రికార్డులను తిరగరాయడంలో సల్మాన్ ఖాన్ ఓ డిఫరెంట్ స్టైల్. ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో తన ఏడు చిత్రాలను వంద కోట్ల క్లబ్ చేర్చిన ఏకైక హీరోగా సల్లూభాయ్ ఓ రికార్డును క్రియేట్ చేశారు. ఇక తాజాగా విడుదలైన కిక్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కలెక్షన్లు మాత్రం కుమ్మెస్తున్నాయి.
తెలుగులో విజయం సాధించిన కిక్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హిందీలో 'కిక్' రీమేక్ పై టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగులో కిక్ చిత్రంలోని ఉండే మజా.. హిందీ రీమేక్ లో కనిపించలేదని సురేందర్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రేక్షకులు పెదవి విరిచినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి.
కిక్ చిత్రంతో తొలిసారి సల్మాన్ ఖాన్ 200 కోట్ల క్లబ్ లో చేరి అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లకు సవాల్ విసిరాడు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కిక్ చిత్రం 309 (గాస్) కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 377 (గ్రాస్) కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ధూమ్3 చిత్రం 542 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ 422 కోట్లు, 3 త్రీ ఇడియెట్స్ 395 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాయి.
Advertisement
Advertisement