ముంబై: ఈ మధ్యనే బాలీవుడ్ లో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న కిక్ చిత్రంలో విలన్ గా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖి తన సినీ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఈ చిత్ర విజయం మాత్రం కచ్చితంగా తన రాబోయే చిత్రాలపై ప్రభావం చూపుతుందన్నాడు.'నేను నటుడిగా చాలా చిత్రాలు చేశాను. ఇది నిజంగా ఒక సవాల్ గా భావించి చేశాను.అది నాకు కచ్చితంగా లాభిస్తుంది'అని తెలిపాడు. కహానీ, మిస్ లవ్లీ చిత్రాల్లో నటించిన సిద్ధిఖి చేతిలో ప్రస్తుతం ఏడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తూ కిక్కెక్కిస్తోంది. షారుక్ ఖాన్ నటించిన 'జబ్ తక్ హై జాన్', సల్లూభాయ్ నటించి 'దబాంగ్2' చిత్రం వసూళ్లను 'కిక్' అధిగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తోంది.
నాకు ఈ సినిమాతో మరింత 'కిక్'!
Published Thu, Aug 7 2014 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement