'నా సినిమాతో పోల్చి చూడొద్దు' | Salman's 'Kick' does not do justice to original says Surender Reddy | Sakshi
Sakshi News home page

'నా సినిమాతో పోల్చి చూడొద్దు'

Published Mon, Jul 28 2014 1:11 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నా సినిమాతో పోల్చి చూడొద్దు' - Sakshi

'నా సినిమాతో పోల్చి చూడొద్దు'

చెన్నై: హిందీ సినిమా 'కిక్'ను ఒరిజినల్ చిత్రంతో పోల్చికూడదని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. తాను తెలుగు తీసిన 'కిక్' సినిమా చూసి దీన్ని జడ్జ్ చేయడం తడదని చెప్పారు. ఒరిజినల్ సినిమాలోని స్ఫూర్తిని హిందీ సినిమా రూపకర్తలు అర్థం చేసుకోలేకపోయారని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.

ఈనెల 25న విడుదలైన సల్మాన్ 'కిక్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆధారమైన తెలుగు 'కిక్' చిత్రం 2009లో విడుదలైంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మంచి విజయాన్ని సాధించి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement