
అటో సెక్సీ తార... ఇటో బొద్దుగుమ్మ...
అటో సెక్సీ తార... ఇటో బొద్దుగుమ్మ... అయినా కిక్ ఎక్కినట్టు లేదు తమిళ తంబి జయం రవికి. ఆలోచన అతనిదో... దర్శకుడిదో గానీ.. ఓ సాంగ్ కోసం ఏకంగా వంద మంది ఫారిన్ డ్యాన్సర్లను సెట్స్‌పైకి రప్పిస్తున్నారు. రవి హీరోగా నటిస్తున్న ‘రోమియో అండ్ జూలియట్’ సినిమాలో హన్సిక, పూనమ్ బజ్వా హీరోయిన్లు. వీరిద్దరూ సరిపోరనుకున్నారేమో... ‘రోమియో రోమియో జూలియట్’ పాటను భారీ స్థాయిలో ఇలా వంద మంది విదేశీ డ్యాన్సర్లతో ఇలా ‘బిగ్’ స్క్రీన్‌పై చూపాలని తపన పడుతున్నారు దర్శకనిర్మాతలు.