వ్యాపారులకే కిక్కు! | Kick merchants! | Sakshi
Sakshi News home page

వ్యాపారులకే కిక్కు!

Published Wed, Jan 7 2015 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

వ్యాపారులకే కిక్కు!

వ్యాపారులకే కిక్కు!

మార్కెట్‌లోకి జోరుగా  కల్తీ మద్యం
 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పెగ్గు మీద పెగ్గు కొడితే...! నిషా నింగినంటాలే... చుక్కలు నేలకు దిగి రావాలే.  మందుబాబులు మబ్బులో  విహరించాలి. ఇదీ మద్యం మహత్యం. అదేంటో ఈ మధ్య ఏ మందుబాబును కదిపినా ‘ఫుల్లు కొట్టినా  కిక్కు ఎక్కుత లేదు గురూ’  అంటూ నిట్టూరుస్తున్నారు. తేడా ఎక్కడొస్తుందో తెలియక తలలు గోక్కుంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందంటే....లిక్కర్ వ్యాపారుల చేతివాటంతోనే మద్యంలో తేడా వచ్చి.. మందుప్రియులకు మత్తెక్కడం లేదని ఇటీవలి సంఘటనలు చెబుతున్నాయి.
 
మద్యం అమ్మకాలు తగ్గాయట!
జిల్లాలో ఉన్నట్టుండి మద్యం సేల్స్ 18 శాతం తగ్గినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి.  గత ఏడాది ఈ నెలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 3 వేల కేసుల లిక్కర్ (ఐఎంఎల్) తక్కువగా అమ్ముడు పోయింది. నిజానికి ప్రతి ఏడాది కనీసం 10 శాతం లిక్కర్ అమ్మకాలు పెరగాలి. కానీ జిల్లాలో అనూహ్యంగా లిక్కర్ విక్రయాలు పడిపోవడం చర్చనీయంగా మారింది.
 
అధికారులు ఇచ్చిన అలుసే...
జిల్లాలో మద్యానికి మంచి డిమాండ్ ఉంది. రోజుకు సగటున రూ.33 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే ఇటీవల ఇది రూ.31 కోట్లకు పడిపోయిందని ఎక్సైజ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పక్క రాష్ట్రం నుంచి అక్రమ మద్యం (ఎన్డీపీల్ )గానీ, దుకాణ దారులు చేతి వాటం ప్రదర్శించడం గానీ జరిగి ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

నిబంధనల ప్రకారం మద్యం దుకాణంలో సీసాలవారీగా మినహాయించి, విడి మద్యం (లూజ్‌సేల్) అమ్మకూడదు. అయితే ఎక్సైజ్ అధికారులు అక్రమంగా కల్పించిన వెసులు బాటుతో దుకాణదారులు విడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు జిల్లాలో నమోదు కాకపోవడం గమనార్హం.
 
మూతలు తీసి...నీళ్లు పోసి.

ఎకై ్సజ్ అధికారులు వేసిన లేబుల్ చెదిరిపోకుండా దుకాణం యాజమాన్యం సీసాపై మూతను తొలగిస్తున్నారు. సీసాలోంచి 100 నుంచి 150  మిల్లీ లీటర్ల లిక్కర్  తీసివేసి అంతే మొత్తంలో నీళ్లు పోస్తున్నారు.  అనుమానం రాకుండా తిరిగి  యథాతధంగా లేబుల్ అతికించి విక్రయిస్తున్నారు. లేబులింగ్ విభాగంలో పనిచేసే ఎకై ్సజ్ అధికారులు తప్ప సాధారణ విధులు నిర్వర్తించే  ఎక్సైజ్ సిబ్బంది గుర్తు పట్టలేరు.  

ఇలాంటి మోసాలు గతంలో మొట్రొపాలిటన్ సీటీలోని మద్యం దుకాణాల్లో మాత్రమే జరిగేవి. వేసిన లేబుల్ పోకుండా సీసాపై మూతలు తొలగించ గల నిపుణులు గతంలో చాలా కొద్ది మంది మాత్ర మే ఉండేవారు. ఇప్పుడు మాత్రం గల్లీకొకరు పుట్టుకొచ్చారు. అంతేకాదు వీరు ఆసక్తి ఉన్న వాళ్లకు మూతలు తీయడంలో తర్ఫీదు నిస్తున్నారు.

మద్యం దుకాణం యాజమాన్యాలు తమకు నమ్మకస్తుడైన వ్యక్తికి ఇలాంటి తర్ఫీదు  ఇస్తారు. మండలాల్లో కూడా మద్యం కల్తీ జరుగుతోంది.  ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో దుకాణంలో పనివాళ్లు మద్యం సీసాల మూత లు తీసి నీళ్లు పోస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆ తర్వాత జరిగిన తతంగంతో సదరు అధికారులు  మద్యం దుకాణం మీద ఎలాంటి కేసులు నమోదు చేయకుండ వదిలేశారు.

వ్యాపారుల, కిక్కు, మద్యం,
Merchants, kick, alcohol
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement