విచారణకు అనుమతుల్లేని కేసులపై ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: అవినీతి కేసుల్లో ఓ అధికారి విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించనప్పుడు ఆ అధికారిపై అవినీతి నిరోధక శాఖ చార్జిషీట్ దాఖలు చేయడా నికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారి పదవీ విమరణ తరువాత అలా దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా సంబం ధిత కోర్టు కేసు విచారణ చేపట్టడానికి కూడా వీల్లేదని చెప్పింది. ప్రభుత్వం నుంచి అనుమ తి లభించని కేసుల్లో పదవీ విరమణ పొందిన తరువాత చార్జిషీట్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల తీర్పు వెలువరించారు.
విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో జె.జి.మురళీ ఆదాయా నికి మించి ఆస్తులు సంపాదిం చారంటూ ఏసీబీ అధికారులు 2007లో కేసు నమోదు చేశారు. 2012లో మురళీ పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తరువా త ఏసీబీ అధికారులు ఆయనపై చార్జిషీట్లు దాఖలు చేశారు. దీనిపై మురళీ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని, అయినా కూడా ఏసీబీ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేశారని, అది కూడా తన పదవీ విరమణ తరువాత చేశారని ఆయన కోర్టుకు నివేదించారు.
విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తీర్పు వెలువరించారు. పదవీ విరమణ పొందితే విచారణకు ప్రభుత్వ అను మతి అవసరం లేదన్న కారణం తో పిటిషనర్ పదవీ విరమణ పొందేంత వరకు వేచి ఉండి ఏసీబీ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయ డంపై న్యాయమూర్తి తన తీర్పులో ఆక్షేపిం చారు. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాద న్నారు. దీంతో మురళీపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులను కొట్టేశారు.