chargesheets
-
పచౌరీపై అభియోగాలు మోపండి
న్యూఢిల్లీ: టెరీ (భారత్‌లో విద్యుత్, పర్యావరణం, సహజ వనరులపై పరిశోధనలు చేసే సంస్థ) మాజీ చీఫ్ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అభియోగాలు మోపాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యంగా వ్యవహరించడం), 354 (ఏ) (శారీరకంగా తాకేందుకు ప్రయత్నించడం), 509 (వేధించడం, అసభ్య పదజాలం, అసభ్య చేష్టలకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చారు గుప్తా ఆదేశించారు. 2015, ఫిబ్రవరి 13న టెరీ మాజీ ఉద్యోగి ఒకరు తనతో పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మార్చి 21న పచౌరీకి ముందస్తు బెయిల్ మంజూరైంది. 2016 మార్చి 1న ఢిల్లీ పోలీసులు 1,400 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. -
చిక్కుల్లో చిదంబరం కుటుంబం
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ తాజా చర్యతో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. చిదంబరంతో సహా ఆయన భార్య నళిని, కుమారుడు కార్తి చిదంబరం, కోడలు శ్రీనిధిలపై ఆదాయ పన్నుశాఖ ఈ కీలక చర్యలకు దిగింది. నల్లధనం చట్టం కింద వీరిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని స్పెషల్ కోర్టు ముందు శుక్రవారం నాలుగు చార్జ్షీట్లను నమోదు చేసింది. ప్రత్యేక పన్నుల చట్టం కింద,(అప్రకటిత విదేశీయ ఆస్తులు, పెట్టుబడులు) సెక్షన్ 50 ప్రకారం ఈ ఆరోపణలను నమోదు చేసింది. నళిని, కార్తి, శ్రీనీధిలపై విదేశీ ఆస్తుల వివరాలను పూర్తిగా కానీ లేదా పాక్షికంగాగానీ ప్రకటించలేదంటూ ఐటీ శాఖ ఆరోపించింది. యూకేలోని కేంబ్రిడ్జ్‌లో రూ. 5.37 కోట్ల విలువైన స్థిరాస్తులు, 80 లక్షల ఆస్తి, అమెరికాలో 3.25 కోట్ల రూపాయల ఆస్తులను వెల్లడించలేదని అధికారులు తెలిపారు. చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ సహ యజమాని కార్తి చిదంబరం పెట్టుబడులను బహిర్గతం చేయకుండా చట్టా ఉల్లంఘనకు పాల్పడ్డారని చార్జిషీట్లో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. కాగా ఈ ఆరోపణలను ఖండించిన కార్తి చిదంబరం తాను ఇప్పటికే వివరాలను సమర్పించినట్టు వాదిస్తూ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో కార్తీకి, ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ శాఖ ఇటీవల నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2015 లో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. విదేశాల్లో అక్రమ సంపదను రహస్యంగా ఉంచిన భారతీయులకు 120 శాతం దాకా జరిమానాతోపాటు పదేళ్ల దాకా శిక్ష విధించే అవకాశ ఉంది. -
ముద్రగడపై చార్జిషీట్ల నమోదుకు రంగం సిద్ధం
రాజమహేంద్రవరం క్రైం : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంపై కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు. డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ముద్రగడను అరెస్టు చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం, మరికొన్ని కేసులతో కలిపి 69 కేసులను సీఐడీ అధికారులు నమోదు చేశారు. వీటిని దర్యాప్తు చేసేందుకు సీఐడీ విభాగంలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరితగతిన దర్యాప్తు జరిగితే మరో రెండు రోజుల్లో కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. సుమారు 50 నుంచి 60 వరకూ చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విధంగా ముద్రగడను జైలుకు తరలిస్తే ఉద్యమాన్ని అణిచివేయవచ్చనేది ప్రభుత్వ ప్యూహంలా కనిపిస్తోందని పలువురు నాయకులు అంటున్నారు. -
చార్జిషీట్లు సరికాదు!
విచారణకు అనుమతుల్లేని కేసులపై ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: అవినీతి కేసుల్లో ఓ అధికారి విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించనప్పుడు ఆ అధికారిపై అవినీతి నిరోధక శాఖ చార్జిషీట్ దాఖలు చేయడా నికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారి పదవీ విమరణ తరువాత అలా దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా సంబం ధిత కోర్టు కేసు విచారణ చేపట్టడానికి కూడా వీల్లేదని చెప్పింది. ప్రభుత్వం నుంచి అనుమ తి లభించని కేసుల్లో పదవీ విరమణ పొందిన తరువాత చార్జిషీట్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో జె.జి.మురళీ ఆదాయా నికి మించి ఆస్తులు సంపాదిం చారంటూ ఏసీబీ అధికారులు 2007లో కేసు నమోదు చేశారు. 2012లో మురళీ పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తరువా త ఏసీబీ అధికారులు ఆయనపై చార్జిషీట్లు దాఖలు చేశారు. దీనిపై మురళీ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని, అయినా కూడా ఏసీబీ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేశారని, అది కూడా తన పదవీ విరమణ తరువాత చేశారని ఆయన కోర్టుకు నివేదించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తీర్పు వెలువరించారు. పదవీ విరమణ పొందితే విచారణకు ప్రభుత్వ అను మతి అవసరం లేదన్న కారణం తో పిటిషనర్ పదవీ విరమణ పొందేంత వరకు వేచి ఉండి ఏసీబీ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయ డంపై న్యాయమూర్తి తన తీర్పులో ఆక్షేపిం చారు. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాద న్నారు. దీంతో మురళీపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులను కొట్టేశారు. -
నయీమ్ కేసుల్లో ఇక చార్జిషీట్లు
-
నయీమ్ కేసుల్లో ఇక చార్జిషీట్లు
♦ పోలీసులను ఆదేశించిన ఏడీజీ అంజనీకుమార్ ♦ ఇప్పటివరకు 72 కేసులు.. 80 మంది అరెస్ట్ ♦ రెండుమూడ్రోజుల్లో కీలక పరిణామాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అతని అనుచరులపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్ మంగళవారం ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణాధికారులతో సమావేశమయ్యారు. నయీమ్ కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్టు చేశారు. వీటికి సంబంధించి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అంజనీకుమార్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. స్థానిక కోర్టుల్లో ఎక్కడికక్కడ వీటిని దాఖలు చేయాలని సూచించారు. నయీమ్ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టయిన 80 మందిలో అతడి కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. నయీమ్ ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నయీమ్ అనుచరుల నుంచి ఈ కోణానికి సంబంధించి వివరాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. నయీమ్‌తో ప్రముఖుల సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా.. కొందరు నేతలపై నల్లగొండ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్‌స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా నయీమ్ కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో కబ్జా, బెదిరింపు ఆరోపణలతో కూడిన వాటిని కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగా ‘సిట్’లో పోలీసు సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. రెండు మూడ్రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారుల పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది -
సీఎం, డిప్యూటీలపై చార్జిషీట్లు!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ పోలీసులు ఆరుసార్లు చార్జిషీటు దాఖలు చేశారు. రెండు కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మీద కూడా చార్జిషీటు దాఖలైంది. ఆమ్ ఆద్మీ పార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలపై మొత్తం 24 కేసులు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసుల దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తిచేసి, వాటిపై చార్జిషీట్లను త్వరలోనే దాఖలు చేయనున్నారు. సీఎం కేజ్రీవాల్ మీద ఉన్న కేసుల్లో.. నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించడం, ప్రభుత్వాధికారులను వాళ్ల విధులు నిర్వర్తించనివ్వకుండా అడ్డుకోవడం లాంటి కేసులున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అయితే 2014 జనవరిలో రైల్వే భవన్ నిరసన కార్యక్రమలో పాల్గొన్నారు. ఆయన కూడా నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో బుక్కయ్యారు. మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ మీద మోసం / ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఇక కరోల్‌బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవిపై కేసులో ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. మనోజ్ కుమార్ అనే ఎమ్మెల్యే మీద కూడా మోసం, ఫోర్జరీ కేసులున్నాయి. వాటితో పాటు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసు కూడా ఉంది. ఆయన మీద నాలుగు ఎఫ్ఐఆర్లు పెండింగులో ఉన్నాయి. నరేష్ బలియాన్ అనే ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మద్యం పంచుతూ పట్టుబడ్డారు. ప్రభుత్వోద్యోగిపై దాడి కేసులో జర్నైల్ సింగ్ అనే ఎమ్మెల్యే బుక్కయ్యారు. ఇక మరో మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి భార్యఆయన మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భారతి తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారని, తనమీదకు కుక్కలను వదిలారని కూడా ఆమె ఆరోపించారు. -
ఉల్లంఘనులపై కొరడా
మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా? చలానా కట్టాల్సి ఉందా? ‘ఇది చెల్లించకపోయినా ఏం కాదులే’ అనే ధీమాతో ఉన్నారా? ఆ భ్రమ నుంచి బయటకు రండి. తక్షణమే చలానా చెల్లించండి. లేదంటే కోర్టు మెట్లు ఎక్కాల్సి రావచ్చు. శిక్షకు గురికావచ్చు. అవును...పెండింగ్ చలానాదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. చార్జిషీట్లు తెరుస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా సోమవారం సంబంధిత వ్యక్తులకు జరిమానా విధించారు. - పెండింగ్ చలానాలపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి - 43 మందిపై చార్జిషీటు - కోర్టుకు హాజరైన వాహనదారులు - మొదటిసారి జరిమానాతో సరి - దేశంలోనే తొలిసారి - భవిష్యత్తులో జైలు శిక్ష విధించే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి... చలానాలు చెల్లించకుండా తిరుగుతున్న వారికి ఇక గడ్డు రోజులే. ఇలాంటి వారు మేలుకోకపోతే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇలా చలానాలు చెల్లించని 43 మంది వాహనదారులకు ఎర్రమంజిల్ కోర్టు సోమవారం రూ.73,800 జరిమానా విధించింది. మొదటి తప్పిదంగా రూ.500 నుంచి రూ.3,700 వరకు జరిమానా విధిస్తూ 3వ మెట్రో పాలిటన్ ఇన్చార్జి మెజిస్ట్రేట్ (రైల్వే కోర్టు మెజిస్ట్రేట్) ఎం.రాజు, 4వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ శివశంకర్‌ప్రసాద్ తీర్పునిచ్చారు. ఆసీఫ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారికి అత్యధికంగా రూ.3,700 జరిమానా పడింది. జరిమానా చెల్లించాల్సిన వారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు. పదిపైన పెండింగ్ చలానాలు ఉన్న వాహదారులపై చార్జిషీట్ పెట్టారు. రానున్న రోజుల్లో మూడు చలానాలు పెండింగ్ ఉన్నా... చార్జిషీట్ పెట్టి... వాహనదారుని కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ డీసీపీ రంగనాథన్ తెలిపారు. వీటిని వెంటనే చెల్లించాలని... లేని పక్షంలో డ్రంకన్‌డ్రైవ్ కేసుల తరహాలోనే వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇదే మొదటిసారి... చలానాలు పెండింగ్‌లో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచడం దేశ చరిత్రలోనే మొదటిసారి. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, నోపార్కింగ్, నో ఎంట్రీ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి గతంలో ట్రాఫిక్ పోలీసులు చలానా విధించేవారు. సంబంధిత మొత్తం చెల్లిస్తే వాహనాన్ని వదిలిపెట్టేవారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి ఠాణాకు తరలించేవారు. దీనివల్ల వాహనదారులు, పోలీసు అధికారుల మధ్య వివాదాలు తలెత్తేవి. దీన్ని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని సుమారు 350 చౌరాస్తాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బందికీకెమెరాలు అందించారు.వీటి ద్వారా ఉల్లంఘనులను గుర్తించి, వారి చిరునామాకు ఈ-చలానా కాపీలను పంపించేవారు. రికవరీకి యత్నాలు ఇలా 2009 నుంచి ఇప్పటి వరకూ చలానా బారిన పడిన వారి సంఖ్య 45 లక్షలు. వీరి నుంచి రావాల్సిన మొత్తం సుమారు రూ.60 కోట్లు ‘పెండింగ్’లో ఉండిపోయాయి. వీరిలో మూడు... ఆపైన చలానాలు బకాయి ఉన్న వారు సుమారు 20 లక్షలు. కనీసం వీరి నుంచైనా రికవరీ మొదలు పెట్టాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ మూడు నెలల క్రితం నిర్ణయించారు. వాహనదారులు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆన్లైన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ-సేవ, మీ-సేవ, ట్రాఫిక్ కాంపౌండింగ్బూత్లలో సౌకర్యం కల్పించారు. జైలుకు వె ళ్లాల్సి వస్తుందని హెచ్చరించడంతో సుమారు 25 లక్షల మంది చలానాలు చెల్లించారు. మిగిలిన వారు స్పందించలేదు. ఇదీ పరిస్థితి ⇒ పెండింగ్ చలానాల కోసం త్వరలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ⇒ చార్జిషీట్ దాఖలు చేసినా కోర్టుకు రాని వాహనదారుడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. ⇒ అదే జరిగితే పోలీసులు అరెస్టు చేసి... కోర్టులో హాజరుపర్చాల్సి వస్తుంది. ⇒ ప్రస్తుతం నోటీసు ద్వారానే వాహనదారులు కోర్టుకు హాజరవుతున్నారు. పెండింగ్ చలానాలు ఇలా.... ఒకటి నుంచి మూడు వరకూ బకాయి ఉన్నవాహనదారులు 16,24,270 మంది 4 5 .... 1,97,058 6 10 .... 1,26,730 11పైన... 39,471 పాస్‌పోర్టు, జాబ్ వెరిఫికేషన్‌కు ఇబ్బందులు తప్పవు పెండింగ్ చలానా విషయంలో కోర్టు శిక్ష విధిస్తే సంబంధిత వ్యక్తుల పాస్‌పోర్టు, విసా, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల వెరిఫికేషన్‌కు ఇబ్బందులు తప్పవు. చట్ట ప్రకారం స్పెషల్ బ్రాంచ్ అధికారులు తమ విచారణలో ఉన్న అంశాలను సంబంధిత సర్టిఫికెట్లలో ప్రస్తావించాల్సి ఉంటుంది. - నాగిరెడ్డి జాయింట్ సీపీ -
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులపై చార్జిషీట్
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్న ఇద్దరిపై ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. దేశ రాజధానిలో దాడులకోసం వ్యాపారులను కిడ్నాప్ చేసి ఆయుధాల కొనుగోలుకు డబ్బులు డిమాండ్ చేశారని తన అభియోగపత్రంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ రషీద్, మహ్మద్‌షాహిద్‌లపై చార్జిషీటు దాఖలు చేసినట్టు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో వీరికి సంబంధమున్నట్టు విచారణలో తేలిందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాది జావేద్ బలూచి, అబ్దుల్ సుభాన్‌లతో వీరికి సంబంధం ఉన్నట్టు తెలిసిందని అదనపు సెషన్స్ జడ్జి దయాప్రకాష్‌కు పోలీసులు వివరించారు. గత సంవత్సరం డిసెంబర్లో హర్యానాలోని మేవత్ ప్రాంతంలో వీరిరువునీ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. -
‘దానం’పై కేసుల్లో చార్జిషీట్లు వేయండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో దానంపై కేసుల్లో పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. దానంపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతీ లేదని, ఈ కేసులో దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.