ముద్రగడపై చార్జిషీట్ల నమోదుకు రంగం సిద్ధం
Published Thu, Jul 13 2017 11:58 PM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
రాజమహేంద్రవరం క్రైం :
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంపై కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు. డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ముద్రగడను అరెస్టు చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం, మరికొన్ని కేసులతో కలిపి 69 కేసులను సీఐడీ అధికారులు నమోదు చేశారు. వీటిని దర్యాప్తు చేసేందుకు సీఐడీ విభాగంలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరితగతిన దర్యాప్తు జరిగితే మరో రెండు రోజుల్లో కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. సుమారు 50 నుంచి 60 వరకూ చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విధంగా ముద్రగడను జైలుకు తరలిస్తే ఉద్యమాన్ని అణిచివేయవచ్చనేది ప్రభుత్వ ప్యూహంలా కనిపిస్తోందని పలువురు నాయకులు అంటున్నారు.
Advertisement
Advertisement