న్యూఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్న ఇద్దరిపై ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. దేశ రాజధానిలో దాడులకోసం వ్యాపారులను కిడ్నాప్ చేసి ఆయుధాల కొనుగోలుకు డబ్బులు డిమాండ్ చేశారని తన అభియోగపత్రంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ రషీద్, మహ్మద్‌షాహిద్‌లపై చార్జిషీటు దాఖలు చేసినట్టు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో వీరికి సంబంధమున్నట్టు విచారణలో తేలిందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాది జావేద్ బలూచి, అబ్దుల్ సుభాన్‌లతో వీరికి సంబంధం ఉన్నట్టు తెలిసిందని అదనపు సెషన్స్ జడ్జి దయాప్రకాష్‌కు పోలీసులు వివరించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో హర్యానాలోని మేవత్ ప్రాంతంలో వీరిరువునీ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులపై చార్జిషీట్
Published Thu, May 8 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement