'గూగుల్‌పే' (Google Pay) తాజాగా 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NPCI)కు చెందిన 'ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్'తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం వెలుపల ఉన్న భారతీయులు యూపీఐ చెల్లింపులు చెల్లించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గూగుల్‌పే ఇప్పుడు ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. విదేశాలకు వెళ్లే ప్రజలు డబ్బు తీసుకెళ్లడం లేదా అంతర్జాతీయ గేట్‌వే చార్జీల భారం తగ్గిపోయింది. ఇది కేవలం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా.. సంస్థ తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన..
ఇతర దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వల్ల.. గూగుల్‌పే కస్టమర్లు అంతర్జాతీయ కరెన్సీ కోసం లేదా ఫారెక్స్ కార్డుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని NPCL సీఈఓ రితేష్ శుక్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment