
రూపే కార్డులతో.. ఈ-కామర్స్ లావాదేవీలు
ప్రభుత్వ రంగం బ్యాంకులు మంజూరుచేసిన రూపే కార్డులతో ఈ-కామర్స్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చని ద నేషనల్
ఈ సౌకర్యం కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డులకే
ముంబై: ప్రభుత్వ రంగం బ్యాంకులు మంజూరుచేసిన రూపే కార్డులతో ఈ-కామర్స్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చని ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ‘ఇకపై రూపే కార్డుదారులు బస్సు, రైలు, విమాన టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ స్టోర్లలో వస్తువులను కొనుగోలు చేయవచ్చు’ అని ఎన్‌పీసీఐ తెలిపింది. ప్రస్తుతం మనదేశంలో 14 కోట్ల రూపే కార్డులు వినియోగంలో ఉన్నాయి. రూపే కార్డులను ఎక్కువగా ప్రభుత్వ రంగ బ్యాంకులే మంజూరు చేశాయి. రూపే కార్డు లావాదేవీలను ఫ్లిప్‌కార్ట్, ఐఆర్‌సీటీసీ, జెట్ ఎయిర్‌వేస్, స్నాప్‌డీల్, ఎల్‌ఐసీ, బుక్‌మైషో వాటితోపాటు దాదాపు 30 వేల ఆన్‌లైన్ వ్యాపార కంపెనీలు అనుమతిస్తున్నాయి. రూపే కార్డుతో కొత్తగా ఈ-కామర్స్ లావాదేవీలను నిర్వహించాలనుకునేవారు తొలి లావాదేవీ సమయంలో వన్‌టైం యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.